Bumrah Vs Bairstow: బుమ్రా యార్కర్‌.. బెయిర్‌ స్టో డకౌట్‌; ప్రశంసల వెల్లువ

7 Sep, 2021 08:50 IST|Sakshi

లండన్‌: టీమిండియా స్పీడస్టర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా యార్కర్ల కింగ్‌ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన యార్కర్లతో ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌కు ఎన్నోసార్లు ముచ్చెమటలు పట్టించాడు. తాజాగా బుమ్రా ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్‌ జానీ బెయిర్‌ స్టోను ఔట్‌ చేసిన విధానం వైరల్‌గా మారింది. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ 67వ ఓవర్‌లో ఇది చోటు చేసుకుంది. 67వ ఓవర్‌ మూడో బంతిని గుడ్‌లెంగ్త్‌తో యార్కర్‌ వేశాడు. బెయిర్‌ స్టో తేరుకునేలోపే బంతి కాళ్ల సందులో నుంచి వెళ్లి వికెట్లను గిరాటేసింది. ఇది అసలు ఊహించని బెయిర్‌ స్టో నిరాశగా పెవిలియన్‌ చేరాడు. ఈ క్యాలండర్‌ ఇయర్‌లో బెయిర్‌ స్టోకు ఇది నాలుగో డకౌట్‌ కావడం విశేషం.

చదవండి: కోహ్లి విషయంలో మొయిన్‌ అలీ చరిత్ర; డకౌట్లలో రహానే చెత్త రికార్డు

కాగా బుమ్రా యార్కర్‌పై ప్రశంసల వెల్లువ కురిసింది. బుమ్రా వేసిన డెలివరీ ''One Of The Best Ball In Test Cricket'' అని గార్డియన్‌ పత్రిక రాసుకొచ్చింది. ఇక ఇంగ్లండ్‌ కెప్టెన్‌ రూట్‌ అయితే బుమ్రాను పొగడ్తలతో ముంచెత్తాడు. నా దృష్టిలో బుమ్రాది క్లాస్‌ డెలివరీ. బెయిర్‌ స్టోను ఔట్‌ చేసిన విధానం సూపర్‌. అతని యార్కర్‌ డెలివరీని నేనుకళ్లారా చూశాను. కొన్నిసార్లు బౌలింగ్‌ అనేది రియలిస్ట్‌గా కనిపిస్తుంది. బుమ్రా విషయంలో అదే జరిగింది. నిజంగా బుమ్రా సూపర్‌ అంటూ చెప్పుకొచ్చాడు. బుమ్రా యార్కర్‌ డెలివరికి సంబంధించిన వీడియో ట్రెండింగ్‌గా మారింది.

ఇక నాలుగో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా 157 పరుగులతో ఘన విజయాన్ని అందుకుంది. 368 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ టీమిండియా పేస్‌, స్పిన్‌ దాటికి 210 పరుగులకు చాప చుట్టేసింది. చివరిసారి 1971లో ఓవల్‌ మైదానంలో ఇంగ్లండ్‌పై టెస్టులో గెలిచిన భారత్‌ ఆ తర్వాత ఈ మైదానంలో ఎనిమిది టెస్టులు ఆడి ఐదింటిని ‘డ్రా’ చేసుకొని, మూడింటిలో ఓడింది. ఎట్టకేలకు 50 ఏళ్ల తర్వాత ఈ మైదానంలో భారత్‌ మళ్లీ విజయం రుచి చూసింది. ఇక తాజా విజయంతో ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈనెల 10 నుంచి మాంచెస్టర్‌లో చివరిదైన ఐదో టెస్టు జరుగుతుంది. 

చదవండి: Jasprit Bumrah: బుమ్రా తొలి వికెట్‌.. వందో వికెట్‌ ఒకేలా.. 

మరిన్ని వార్తలు