IPL 2022: 'బుమ్..బుమ్.. బుమ్రా.. కింగ్‌ ఈజ్‌ బ్యాక్‌'

9 May, 2022 23:03 IST|Sakshi
Courtesy: IPL Twitter

ఐపీఎల్‌-2022లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా 5 వికెట్లతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో తన నాలుగు ఓవర్ల కోటాలో 10 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. కాగా తన ఐపీఎల్‌ కెరీర్‌లో తొలి ఐదు వికెట్ల ఘనత బుమ్రా సాధించాడు.

ఇన్నింగ్స్‌ 18 ఓవర్‌ వేసిన బుమ్రా మూడు వికెట్లు పడగొట్టి మెయిడిన్‌ చేశాడు. ముఖ్యంగా నితీష్ రాణా,ఆండ్రీ రస్సెల్,సునీల్ నరైన్ వంటి కీలక వికెట్లను బుమ్రా పడగొట్టాడు. ఈ క్రమంలో ట్విటర్‌లో బుమ్రాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. "బుమ్..బుమ్.. బుమ్రా.. కింగ్‌ ఈజ్‌ బ్యాక్‌.." అంటూ ఓ నెటిజన్‌ ట్విట్‌ చేశాడు.

చదవండి: IPL 2022: "పొలార్డ్‌ను పక్కన పెట్టండి.. ఆ యువ ఆటగాడికి అవకాశం ఇవ్వండి"

మరిన్ని వార్తలు