IND vs BAN: బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌.. 12 ఏళ్ల తర్వాత భారత బౌలర్‌ రీ ఎంట్రీ!

10 Dec, 2022 13:04 IST|Sakshi

బంగ్లాదేశ్‌తో వన్డే, టెస్టు సిరీస్‌లకు టీమిండియా వెటరన్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. వన్డే సిరీస్‌కు షమీ స్థానాన్ని యువ పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌తో భర్తీ చేసిన బీసీసీఐ.. ఇప్పడు టెస్టులకు మాత్రం ఆనూహ్య నిర్ణయం తీసుకుంది. బంగ్లాతో టెస్టు సిరీస్‌కు షమీ స్థానంలో జయ్‌దేవ్ ఉనద్కట్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది.

కాగా జయ్‌దేవ్ ఉనద్కట్‌ 2010లో సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశాడు. ఆ మ్యాచ్‌లో ఉనద్కట్‌ ఒక్క వికెట్‌ కూడా సాధించలేకపోయాడు. ఆ తర్వాత నుంచి ఉనద్కట్‌కు భారత జట్టు తరపున ఆడే అవకాశం రాలేదు. అయితే ఇటీవల ముగిసిన విజయ్ హాజారే ట్రోఫీలో సౌరాష్ట్రకు సారథ్యం వహించిన ఉనద్కట్‌.. తమ జట్టును విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు.

ఉనద్కట్‌ 19 వికెట్లతో టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలిచాడు. దేశీవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తుండడంతో ఉనద్కట్‌కు మళ్లీ భారత జట్టు నుంచి పిలుపు వచ్చింది. కాగా ఇప్పటి వరకు ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 86 మ్యాచులు ఆడిన ఉనద్కట్.. 311 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టిన ఘనత కూడా అతడు సాధించాడు. ఇక బంగ్లా దేశ్‌- భారత జట్ల మధ్య తొలి టెస్టు ఛాటోగ్రామ్‌ వేదికగా డిసెంబర్‌ 14 నుంచి ప్రారంభం కానుంది.
చదవండి: Abrar Ahmed: ఇదేం బౌలింగ్‌రా బాబూ! మొదటి 7 వికెట్లు.. ఆ గూగ్లీ స్పెషల్‌.. స్టోక్స్‌ మతిపోయింది!

మరిన్ని వార్తలు