Jemimah Rodrigues: 43 బంతుల్లో 92 పరుగులతో విధ్వంసం; థ్రిల్లింగ్‌ విక్టరీ

25 Jul, 2021 10:46 IST|Sakshi

లండన్‌: భారత బ్యాట్స్‌వుమెన్‌ జెమిమా రోడ్రిగ్స్ ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతున్న హండ్రెడ్స్‌ వుమెన్స్‌ కాంపిటీషన్‌ టోర్నీలో విధ్వంసం సృష్టించింది. టోర్నీలో రోడ్రిగ్స్‌ నార్తన్‌ సూపర్‌చార్జర్స్‌ వుమెన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తుంది. 43 బంతుల్లోనే 92 పరుగులు చేసిన ఆమె ఇన్నింగ్స్‌లో 17 ఫోర్లు, 1 సిక్సర్‌ ఉన్నాయి. ఆమె ధాటికి మరో 15 బంతులు ఉండగానే థ్రిల్లింగ్‌ విక్టరీని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన వెల్ష్ ఫైర్ మహిళల జట్లు 100 బంతుల్లో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. హెలీ మాథ్యూస్‌ 30 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. నార్తన్‌ సూపర్‌చార్జర్స్‌ బౌలింగ్‌లో స్మిత్‌ 3, కేతి లెవిక్‌, అలిస్‌ రిచర్డ్స్‌ చెరో 2 వికెట్లు తీశారు.

అనంతరం బ్యాటింగ్‌ చేసిన నార్తన్‌ సూపర్‌చార్జర్స్‌కు ఆరంభంలోనే షాక్‌ తగిలింది. కెప్టెన్‌ లారెన్‌ విన్‌ఫిల్డ్‌ డకౌట్‌గా వెనుదిరిగింది. ఆ తర్వాత 19 పరుగుల వ్యవధిలో వరుస విరామాల్లో నాలుగు వికెట్లు కోల్పోయింది. ఇక నార్తన్‌ మ్యాచ్‌ ఓడిపోతుదనుకుంటున్న తరుణంలో రోడ్రిగ్స్‌ బౌండరీల వర్షం కురిపిస్తూ విధ్వంసం సృష్టించింది. చూస్తుండగానే హాఫ్‌ సెంచరీ మార్క్‌ చేరుకున్న రోడ్రిగ్స్‌ 92 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును గెలిపింయింది. ఇక బెస్‌ హెత్‌ 12, అలిస్‌ రిచర్డ్స్‌ 23 పరుగులతో ఆమెకు సహకరించారు. ప్రస్తుతం జేమీ రోడ్రిగ్స్‌ ఇన్నింగ్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని వార్తలు