పాక్‌ అభిమానికి దిమ్మతిరిగే రిప్లై

31 Aug, 2020 14:43 IST|Sakshi

కరాచీ: న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ జిమ్మీ నీషమ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్‌ మీడియాలో ప్రత్యేకంగా ట్వీటర్‌లో  ఆసక్తికర పోస్ట్‌లే కాకుండా, అదే తరహాలో రిప్లైలు ఇవ్వడంలో నీషమ్‌ది వినూత్న శైలి. తాజాగా ఒక పాకిస్తాన్‌ క్రికెట్‌ అభిమానికి నీషమ్‌ చాలా కూల్‌గా సమాధానం ఇచ్చాడు. ట్వీటర్‌లో నీషమ్‌ను ట్రోల్‌ చేసిన అలీ హైదర్‌ అనే పాక్‌ అభిమాని.. ‘మీరు ఎందుకు ఐపీఎల్‌ మాత్రమే ఆడతారు.. పీఎస్‌ఎల్‌ ఎందుకు ఆడరు?’ అని ప్రశ్నించాడు. ఇంకో అడుగు ముందుకేసిన సదరు అభిమాని ‘మీకు ఐపీఎల్‌ డబ్బుతో పాటు ఫేమ్‌ను కూడా తెచ్చుపెడుతుంది కదా.. అందుకేనా ఐపీఎల్‌కు ప్రాధాన్యం’ అని చమత్కరించాడు.(చదవండి:సీఎస్‌కే చేసిన పొరపాటు అదేనా?)

దీనికి నీషమ్‌ అవుననే సమాధానాన్ని చెప్పకనే చెప్పేస్తూ.. ‘ దాంతో పాటు పీఎస్‌ఎల్‌ అనేది మా సమ్మర్‌ సీజన్‌లోనే ఆరంభమవడం కూడా కారణం కావొచ్చు కదా బాస్‌’ అంటూ పాక్‌ అభిమానికి రిప్లై ఇచ్చాడు. అంటే పీఎస్‌ఎల్‌ జరిగే షెడ్యూల్‌ మారితే తాను ఆడటానికి ఏమీ ఇబ్బంది ఉండకపోవచ్చనే సమాధానాన్ని నీషమ్‌ ఇచ్చాడు. దాంతో ఆ అభిమాని చేసేది లేక ఇక తిరిగి ఏమీ కౌంటర్‌ ఇవ్వలేకపోయాడు. 

ఈ ఏడాది ఐపీఎల్‌లో కింగ్స్‌ పంజాబ్‌ తరఫున నీషమ్‌ ఆడుతున్నాడు. గతేడాది చివర్లో జరిగిన వేలంలో నీషమ్‌ను 50 లక్షల రూపాయల కనీస ధరకు కింగ్స్‌ పంజాబ్‌ కొనుగోలు చేసింది. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున నీషమ్‌ ఆడగా, ఈ సీజన్‌లో పంజాబ్‌కు ఆడుతున్నాడు. కాగా, ఈసారి పలువురు న్యూజిలాండ్‌ ఆటగాళ్లు ఐపీఎల్‌కు సిద్ధమయ్యారు. నీషమ్‌ పంజాబ్‌కు లూకీ ఫెర్గ్యూసన్‌ కేకేఆర్‌కు ఆడుతుండగా, మెక్‌లాన్‌గెన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌లు ముంబైకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. కేన్‌ విలియమ్సన్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున బరిలోకి దిగుతున్నాడు. మిచెల్‌ సాంత్నార్‌ సీఎస్‌కేకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.(చదవండి: తొలి బంతికే భయపడ్డాను: కోహ్లి)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు