ఊహించని విధంగా బౌన్సర్‌ వేశాడు.. దాంతో

29 Jun, 2021 14:46 IST|Sakshi

లండన్‌: ఇంగ్లండ్‌ జట్టు శ్రీలంకతో వన్డే సిరీస్‌కు ఆడుతున్న సంగతి తెలిసిందే. కాగా ఆ టెస్టు జట్టు కెప్టెన్‌ జో రూట్‌ మాత్రం యార్క్‌షైర్‌ తరపున ఆడుతూ టీ20 బ్లాస్ట్‌ 2021లో బిజీగా ఉన్నాడు. జో రూట్‌లో మంచి ఆఫ్‌ స్పిన్నర్‌ దాగున్న సంగతి మనం టీమిండియాతో టెస్టు సిరీస్‌లో చూశాము. తాజాగా యార్క్‌షైర్‌ తరపున మూడు మ్యాచ్‌లు ఆడిన రూట్‌ 65 పరుగులు మాత్రమే చేసి అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఇక లీస్టర్‌షైర్‌ ఫాక్సెస్‌తో జరిగిన మ్యాచ్‌లో రూట్‌ తన ఆఫ్‌స్పిన్‌ బౌలింగ్‌లో ఎవరు ఊహించని విధంగా బౌన్సర్‌తో మెరిశాడు. కానీ ఆ బంతిని ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ ఆరోన్‌ లిల్లీ బౌండరీ తరలించాడు.

రూట్‌ వేసిన ఆ ఓవర్లో సిక్స్‌, ఫోర్‌ సహా మొత్తం 10 పరుగులు వచ్చాయి. కాగా రూట్‌ వేసిన బౌన్సర్‌పై కామెంటేటర్స్‌తో పాటు అభిమానులు వినూత్న రీతిలో స్పందించారు. ఇక ఈ మ్యాచ్‌లో లీస్టర్‌షైర్‌ 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన లీస్టర్‌షైర్‌ 3 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన యార్క్‌షైర్‌ 173 పరుగులకే పరిమితమైంది.

చదవండి: పాపం ఇలా అవుటవుతానని ఊహించి ఉండడు

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు