ICC Player Of The Month August 2021: జో రూట్‌ ఘనత.. ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ మంత్‌గా

14 Sep, 2021 09:08 IST|Sakshi

దుబాయ్‌: ఆగస్టు నెలకు గాను ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డును పురుషుల విభాగంలో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ సొంతం చేసుకున్నాడు. ఇక మహిళల విభాగంలో ఐర్లాండ్‌ వుమెన్‌ క్రికెటర్‌ ఈమెయర్ రిచర్డ్సన్ గెలుచుకుంది. ఈ మేరకు ఐసీసీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. కాగా రూట్‌తో పాటు టీమిండియా నుంచి జస్‌ప్రీత్‌ బుమ్రా, షాహిన్‌ అఫ్రిదిలు కూడా అవార్డు బరిలో నిలిచారు. రూట్‌ స్థిరమైన ప్రదర్శన కారణంగా అతన్ని ఆగస్టు నెలకుగానూ ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డుకు ఎంపికచేసినట్లు ఐసీసీ తెలిపింది. టీమిండియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో రూట్‌ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. వరుసగా మూడు టెస్టుల్లో మూడు సెంచరీలు సాధించి అరుదైన రికార్డు సాధించాడు. ఈ ప్రదర్శనతో సెప్టెంబర్‌ 1న ప్రకటించిన ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో రూట్‌ అగ్రస్థానానికి దూసుకెళ్లాడు.

చదవండి: ICC Special Award: ఫీల్డర్లను పరుగులు పెట్టించిన కుక్క.. ఐసీసీ ప్రత్యేక అవార్డు

ఇక​ మహిళల విభాగంలో అవార్డును దక్కించుకున్న ఈమెయర్‌ రిచర్డసన్‌ ఐసీసీ వుమెన్స్‌  టీ20 ప్రపంచకప్‌ క్వాలిఫయర్‌ టోర్నీలో అద్భుత ప్రదర్శనతో ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీగా నిలిచింది. జర్మనీతో జరిగిన మ్యాచ్‌లో  2/6తో బెస్ట్‌ గణాంకాలు నమోదు చేసిన రిచర్డ్‌సన్‌.. ఆ తర్వాత నెదర్లాండ్స్‌, ఫ్రాన్స్‌లతో జరిగిన మ్యాచ్‌ల్లోనూ మంచి ప్రదర్శన కనబరిచింది. ఐసీసీ వుమెన్స్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డును గెలుచుకున్నందుకు సంతోషంగా ఉంది. ఇది అసలు ఊహించలేదు. ఓట్లు వేసి నన్ను గెలిపించిన అభిమానులకు కృతజ్ఞతలు అంటూ రిచర్డ్‌సన్‌ ఆనందం వ్యక్తం చేసింది.  

చదవండి: ఒకే మ్యాచ్‌లో.. ఒకే బౌలర్‌ చేతిలో ఏకంగా ఐదుగురు మన్కడింగ్‌

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు