WI vs ENG: ఇంగ్లండ్‌ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పనున్న జో రూట్‌!

25 Mar, 2022 09:39 IST|Sakshi

వెస్టిండీస్‌ పర్యటన అనంతరం ఇంగ్లండ్‌ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నట్లు జో రూట్‌ హింట్‌ ఇచ్చాడు. సిరీస్‌లో అఖరి టెస్టులో వెస్టిండీస్‌తో ఇంగ్లాండ్‌ తలపడతోంది. తొలి రెండు మ్యాచ్‌లు డ్రాగా ముగియడంతో చివరి మ్యాచ్‌లో సత్తా చాటాలని ఇరు జట్లు బావిస్తోన్నాయి. ఈ క్రమంలో విలేకేరుల సమావేశంలో మాట్లాడిన జో రూట్‌ కీలక వాఖ్యలు చేశాడు. "ఇటువంటి సమయంలో జట్టును ముందుకు తీసుకెళ్లేందుకు నేనే సరైన వ్యక్తినని భావిస్తున్నాను. కానీ, మాకు ప్రస్తుతం  ప్రధాన కోచ్ లేడు. ప్రధాన కోచ్ వచ్చి భిన్నంగా ఆలోచిస్తే, కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి నేను సిద్దంగా ఉన్నాను.

నేను ఇంగ్లండ్‌ జట్టుకు పెద్ద అభిమానిని. మా జట్టు ప్రపంచంలో అత్యుత్తమ జట్టుగా ఉండాలి అని ఎప్పడూ కోరుకుంటాను. కాబట్టి మేనేజెమెంట్‌ ఏ నిర్ణయం తీసుకున్న దానికి నేను ‍కట్టుబడి ఉంటాను. ఇప్పటి వరకు జట్టును అత్యుత్తమ స్థితిలో ఉంచడానికి నా వంతు నేను కృషి చేశాను. కెప్టెన్‌గానే కాకుండా జట్టు సభ్యడిగా కూడా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను" అని రూట్‌ పేర్కొన్నాడు. ఇక వెటరన్ బ్యాటర్ అలిస్టర్ కుక్ రాజీనామా చేసిన తర్వాత 2017లో జో రూట్ ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

రూట్‌ ఇప్పటి వరకు 63 టెస్టులకు సారథ్యం వహించాడు. అయితే ఈ ఏడాది యాషెస్‌ సిరీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఘోర ఓటమి తర్వాత రూట్‌పై విమర్శలు వెల్లు వెత్తాయి. అంతే కాకుండా వెంటనే ఇంగ్లండ్‌ కెప్టెన్సీ నుంచి తప్పించాలని మాజీలు డిమాండ్‌ చేశారు. మరో వైపు యాషెస్‌ సిరీస్‌లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఇంగ్లండ్‌ హెడ్‌ కోచ్‌ పదవి నుంచి క్రిస్‌ సిల్వర్‌ వుడ్‌ తప్పుకున్నాడు. అప్పటి నుంచి రూట్‌ కూడా కెప్టెన్సీ తప్పుకుంటాడని వార్తలు వినిసిస్తున్నాయి. అయితే తాజాగా రూట్‌ చేసిన వాఖ్యలు ఆ వార్తలకు మరింత ఆజ్యం పోశాయి.

చదవండి: భారత అభిమానులకు గుడ్ న్యూస్‌.. మూడు వన్డేలు, ఐదు టీ20లు.. ఏ జట్టుతో అంటే!

మరిన్ని వార్తలు