-

Joe Root: ఇంగ్లండ్‌ తరపున మూడో బ్యాట్స్‌మన్‌గా.. ఓవరాల్‌గా ఐదో ఆటగాడు

27 Aug, 2021 10:23 IST|Sakshi

లీడ్స్‌: ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ 2021లో అత్యద్భుత ఫామ్‌ను కనబరుస్తున్నాడు. వరుస సెంచరీలతో హోరెత్తిస్తున్న రూట్‌ రికార్డులను తిరగరాస్తున్నాడు. 2021లో ఇప్పటి వరకు 11 టెస్టుల్లో 21 ఇన్నింగ్స్‌లు ఆడిన అతను 69.90 సగటుతో 1398 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు ఉన్నాయి. భారత్‌పైనే 875 పరుగులు చేయగా  అందులో 4 సెంచరీలు ఉన్నాయి. ఇదే జోరును అతను కొనసాగిస్తే ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక పరుగుల మొహమ్మద్‌ యూసుఫ్‌ (1788) రికార్డును అతను అధిగమించవచ్చు. ప్రస్తుత  సిరీస్‌తో పాటు ఈ ఏడాది ‘యాషెస్‌’తో కలిపి రూట్‌ కనీసం మరో ఐదు టెస్టులు ఆడే అవకాశం ఉంది. అతను మరో 391 పరుగులు చేస్తే ఒక క్యాలండర్‌ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలుస్తాడు.
చదవండి: ఇంగ్లండ్‌ తరపున మూడో బ్యాట్స్‌మన్‌గా.. ఓవరాల్‌గా ఐదో ఆటగాడిగా

ఇక ఇంగ్లండ్‌ తరపున ఒకే క్యాలండర్‌ ఇయర్‌లో ఆరు సెంచరీలు సాధించిన మూడో బ్యాట్స్‌మన్‌గా రూట్‌ నిలిచాడు. ఇంతకముందు వాన్‌(2002), డెన్నిస్‌ కాంప్టన్‌(1947) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఇక  టీమిండియాపై టెస్టుల్లో 8వ సెంచరీ సాధించిన ఐదో ఆటగాడిగా రూట్‌ నిలిచాడు. ఇంతకముందు గ్యారీ సోబర్స్‌, వివ్‌ రిచర్డ్స్‌, రికీ పాంటింగ్‌, స్టీవ్‌ స్మిత్‌ టీమిండియాపై టెస్టుల్లో ఎనిమిది సెంచరీల మార్క్‌ను అందుకున్నారు. ఇక కెప్టెన్‌గా జో రూట్‌ టెస్టుల్లో 12 సెంచరీలు సాధించి అలిస్టర్‌ కుక్‌ సరసన నిలిచాడు.

ఇక హెడింగ్లీ టెస్టుపై ఇంగ్లండ్‌ పట్టు బిగించింది. తొలి రోజు తమ బౌలింగ్‌తో భారత్‌ను దెబ్బ తీసిన ఆతిథ్య జట్టు రెండో రోజు బ్యాటింగ్‌ జోరును చూపించింది. ఓపెనర్లు వేసిన బలమైన పునాదిపై వరుసగా మూడో టెస్టులోనూ సారథి రూట్‌ శతకంతో భారీ స్కోరుకు బాట వేశాడు. దాంతో ఇప్పటికే ఇంగ్లండ్‌ 345 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది. ఇలాంటి స్థితిలో భారత్‌ ఎదురీది ఎంత వరకు ఈ మ్యాచ్‌లో పోరాడగలదో చూడాలి. 

చదవండి: ఇంగ్లండ్‌ అభిమానుల ఓవరాక్షన్‌.. సిరాజ్‌పై బంతితో దాడి

మరిన్ని వార్తలు