Ashes Series: ముందు 7 టెస్టులు గెలిస్తేనే.. : జో రూట్‌

2 Jun, 2021 11:08 IST|Sakshi

న్యూజిలాండ్, భారత్‌తో జరగనున్న టెస్ట్‌ సిరీస్‌ల గెలుపు యాషెస్‌కు ఎంతో కీలకం కానుందని ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ తెలిపారు. లార్డ్స్ వేదికగా బుధవారం నుంచి ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య రెండు టెస్టుల సిరీస్‌ ప్రారంభంకానుంది. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్ ముగిసిన తర్వాత భారత్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్ తలపడాల్సి ఉంది.

వరుస విజయాలు ఎంతో అవసరం
న్యూజిల్యాండ్‌, భారత్‌తో జరగనున్న 7 టెస్ట్‌ మ్యాచ్‌లను గెలిచి యాషెస్‌ సిరీస్‌కి తమ జట్టు ఆస్ట్రేలియాలోకి ఆత్మవిశ్వాసంతో అడుగుపెట్టాలని భావిస్తున్నట్లు రూట్‌ తెలిపారు. ఇందుకోసం ఇంగ్లండ్ జట్టు తీవ్రంగా శ్రమిస్తోందని చెప్పారు. లార్డ్స్‌లో బుధవారం ప్రారంభమయ్యే 2 మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లాండ్‌ న్యూజిలాండ్‌తో తలపడనుంది, ఆపై ఆగస్టు 4 నుంచి 5 టెస్టులు భారత్‌తో తలపడనుంది. లార్డ్స్ టెస్ట్ సందర్భంగా కేన్ విలియమ్సన్ జట్టుపై గెలుపుకోసం రూట్ ఇప్పటికే ప్రణాళికలు రూపొందించే పనిలో పడ్డాడు.

యాషెస్‌ మాకెంతో ప్రత్యేకం
ఈ విషయాల గురించి రూట్‌ మాట్లాడుతూ... ఈ వేసవి అంతా ఆస్ట్రేలియాతో తలపడనున్న యాషెస్‌ సిరీస్‌ గురించి నిరంతరం సంభాషణలు జరుగుతున్నాయని చెప్పారు. ఎందుకంటే మాకు ఆ సిరీస్‌ ఎంతో ప్రత్యేకమైనది. ఒక ఇంగ్లీష్ అభిమానిగా, ఇంగ్లీష్ ప్లేయర్‌గా యాషెస్‌ అనేది ఐకానిక్ సిరీస్ మాత్రమే కాదు ఎంతటి ప్రతిష్టాత్మకమో తెలుసు కాబట్టే మేము యాషెస్‌ను ప్రత్యేకంగా చూస్తామన్నారు. ఈ నేపథ్యంలో రానున్న వరుస టెస్ట్‌ మ్యాచ్‌ మ్యాచ్‌ల గెలుపు చాలా కీలకమని తెలిపారు. ప్రస్తుతం ఈ రెండు ఉత్తమ జట్టులతో ఆడటం మా ఆటగాళ్లకు గొప్ప అవకాశమని రూట్ తెలిపారు. ఇక, బెన్ స్టోక్స్ లేకపోవడంతో స్టువర్ట్ బ్రాడ్ న్యూజిలాండ్ తరపున ఇంగ్లాండ్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. కాగా ఇప్పటికే ముంబయికి చేరుకుని క్వారంటైన్‌లో ఉన్న భారత క్రికెటర్లు.. బుధవారం స్పెషల్ ఛార్టెర్ ప్లైట్‌లో ఇంగ్లాండ్‌కి బయల్దేరి వెళ్లనున్నారు.

చదవండి: తొలి టెస్ట్‌కు ముందు ఇంగ్లండ్‌కు గట్టి షాక్‌..

మరిన్ని వార్తలు