'నేను బౌలింగ్‌కు వస్తే గేల్‌ సెంచరీ చేయలేడు'

31 Oct, 2020 17:54 IST|Sakshi

అబుదాబి : ఐపీఎల్‌ 13వ సీజన్లో శుక్రవారం రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్చర్‌ బౌలింగ్‌లో గేల్‌ క్లీన్‌బౌల్డ్‌ అయి ఒక్క పరుగుతో సెంచరీ చేజార్చుకున్న సంగతి తెలిసిందే. ఒక్క పరుగు దూరంలో అవుటాయన్న కోపంతో గేల్‌ అసహనం వ్యక్తం చేస్తూ చేతిలోని బ్యాట్‌ను విసిరేయడం వైరల్‌గా మారింది. కాగా ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళిని ఉల్లఘించినందుకు క్రిస్‌ గేల్‌పై అంపైర్లు చర్య తీసుకున్నారు. అతడి మ్యాచ్‌ ఫీజులో 10 శాతం కోత విధించారు. అయితే గేల్‌ను ఔట్‌ చేసిన ఆర్చర్‌కు ప్రశంసలతో పాటు గేల్‌ అభిమానుల నుంచి తిట్లు కూడా అందాయి. (చదవండి : తప్పు ఒప్పుకున్న గేల్‌)

తాజాగా గేల్‌ను 99 పరుగుల వద్ద అవుట్‌ చేయడంపై జోఫ్రా ఆర్చర్‌ ట్విటర్‌లో స్పందించాడు. ఇలాంటివి తాను గతంలోనూ ఎన్నో చూశానని.. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను 99 పరుగుల వద్ద అవుట్‌ చేస్తే ఆ మజా వేరుగా ఉంటుందని ఆర్చర్‌ తెలిపాడు. ఈ సందర్భంగా తాను గతంలో గేల్‌నుద్దేశించి చేసిన ట్వీట్స్‌ను మరోసారి గుర్తు చేశాడు. ' నేను బౌలింగ్‌కు వస్తే గేల్‌ను సెంచరీ చేయనివ్వనని నాకు ముందే తెలుసు'.. ' క్రిస్ ‌గేల్‌.. కమాన్‌ మ్యాన్‌ .. ఇలాంటి విషయాలకు హర్ట్‌ కావడం ఏంటి' అంటూ ట్వీట్స్‌ ఉన్నాయి.

వాస్తవానికి ఇందులో మొదటి ట్వీట్‌ 2013.. ఫిబ్రవరి, 22న.. రెండో ట్వీట్‌ 2016,మార్చి 31న చేశాడు. ఆర్చర్‌ చేసిన ఈ రెండు ట్వీట్స్‌ శుక్రవారం గేల్‌ ఇన్నింగ్స్‌కు సరిగ్గా సరిపోయాయి. ప్రస్తుతం ఆర్చర్‌ చేసిన పాత ట్వీట్స్‌ వైరల్‌గా మారాయి. ఆర్చర్‌ ట్వీట్స్‌పై రాజస్తాన్‌ యాజమాన్యం స్పందిస్తూ.. ఆర్చర్‌ చెప్పింది ఈరోజు 100 శాతం నిజమైంది అంటూ ట్వీట్‌ చేశారు. ఇక చివర్లో గేల్‌ నువ్వు ఇప్పటికీ యునివర్స్‌ల్‌ బాస్‌వే అంటూ ఆర్చర్‌ ట్వీట్‌ చేయడం విశేషం.(చదవండి : బ్యాట్‌ విసిరేసిన గేల్‌..)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు