వారిదే టైటిల్‌.. ఆర్చర్‌ జోస్యం నిజమయ్యేనా?

27 Oct, 2020 15:21 IST|Sakshi

దుబాయ్‌:  ఇంగ్లండ్ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ తన బౌలింగ్‌తోనే కాదు.. తన ట్వీట్ల ద్వారాను ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. ఆర్చర్‌ ఎప్పుడో చెప్పింది వాస్తవ రూపం దాల్చడంతో అతని ట్వీట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రధానంగా క్రికెట్‌లో ఏది జరిగినా ఆర్చర్‌ ముందే చెప్పాడనే ట్వీట్‌ మన ముంగిట నిలుస్తూ ఉంటుంది. అయితే అందులో వాస్తవం ఎంతనేది ఆర్చర్‌కే తెలియాలి. నిజంగానే ఆర్చర్‌ టైమ్‌ మిషీన్‌ ఉందా అని ప్రశ్న కూడా అభిమానులు మనసుల్లో ఇప్పటికీ మెదులుతూనే ఉంది. (సల్మాన్‌ పాత ట్వీట్‌ వైరల్‌!)

ప్రస్తుత ఐపీఎల్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌ రాజస్తాన్‌ తరఫున ఆడుతున్న ఆర్చర్‌ ఒక అద్భుతమైన క్యాచ్‌ను పట్టాడు. కార్తీక్‌ త్యాగి వేసిన 11 ఓవర్‌ నాల్గో బంతిని భారీ షాట్‌ ఆడిన ముంబై ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌.. బౌండరీ లైన్‌ కు కాస్త ముందు ఆర్చర్‌ ఒంటి చేత్తో క్యాచ్‌ పట్టడంతో వెనుదిరిగాడు. ఆ క్యాచ్‌ను పట్టడం కష్టసాధ్యమనుకున్న తరుణంలో ఆర్చర్‌ దాన్ని అందుకుని శభాష్‌ అనిపించాడు. అసాధారణమైన క్యాచ్‌లను పట్టడం క్రికెట్‌లో ఒకటైతే, ఈ విషయాన్ని ఆర్చర్‌  దాన్ని ముందుగా చెప్పడమే ఆసక్తికరంగా మారింది. 2014లో ఆర్చర్‌ ఒక ట్వీట్‌ చేశాడు. అది ‘క్యాచ్‌ ఆఫ్‌ ది ఐపీఎల్‌’ అని ఆర్చర్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. 

వారిదే టైటిల్‌.. ఆర్చర్‌ జోస్యం
ఐపీఎల్ 13 సీజన్ తుది దశకు చేరుకుంది. అయితే ఈ సీజన్ టైటిల్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ గెలుస్తుందని రాజస్థాన్ రాయల్స్ పేసర్ జోఫ్రా ఆర్చర్ జోస్యం చెప్పాడు. అయితే ఈ ఇంగ్లండ్ పేసర్ చెప్పింది ఇప్పుడు కాదు... ఆరేళ్ల క్రితం.  కింగ్స్ పంజాబ్ టైటిల్ గెలుస్తుందని 2014లో ట్వీట్ చేశాడు.  ఆర్చర్ 2014లో చేసిన ట్వీట్ కింగ్స్ పంజాబ్ ఇటీవలే రీ ట్వీట్ చేసింది. కింగ్స్‌ పంబాబ్‌ ఇప్పటివరకూ ఆరు మ్యాచ్‌ల్లో గెలవగా, అందులో ఐదు వరుసగా గెలిచినవే. వరుస ఐదు ఓటముల తర్వాత పంజాబ్‌ పుంజుకుని ఇలా ప్లే ఆఫ్‌ రేసులోకి రావడంతో పంజాబ్‌దే టైటిల్‌ను అంతా అనుకుంటున్నారు.  

2014లో ఫైనల్‌కు చేరిన కింగ్స్‌ పంజాబ్‌.. కేకేఆర్‌ చేతిలో చతికిలబడింది. ఈసారి కచ్చితంగా టైటిల్‌ను కింగ్స్‌ పంజాబ్‌ ఎగురేసుకుపోతుందని ఒక సెక్షన్‌ వర్గం అభిమానులు అభిప్రాయపడుతున్నారు.  మరికొంతమంది అంత సీన్‌లేదని అంటున్నారు. ప్రధానంగా సెకండ్‌ లెగ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. అదే సమయంలో ఆర్చర్‌ ఎప్పుడో ట్వీట్‌ చేసిన మరొకసారి ప్రత్యక్షం కావడం, దాన్ని కింగ్స్‌ పంజాబ్‌ రీట్వీట్‌ చేయడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయ్యాయి. మరి పంజాబ్‌ టైటిల్‌ గెలుస్తుందా.. ఆర్చర్‌ జోస్యం నిజమవుతుందా అనేది చూడాలి. ఆర్చర్‌ జోస్యం నిజమవుతుందా.. లేదా అనేది కూడా కింగ్స్‌ పంజాబ్‌కు ప్రశ్నగానే ఉంది. ఇదే విషయాన్ని పేర్కొంటూ ఆర్చర్‌ ట్వీట్‌ను రీట్వీట్‌ చేసింది కింగ్స్‌ పంజాబ్‌.(వచ్చే ఏడాది కూడా ధోనీ సారథ్యంలోనే!)

మరిన్ని వార్తలు