CSA T20 League: జోహన్నెస్‌బర్గ్ సూపర్ కింగ్స్ హెడ్‌ కోచ్‌గా న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్‌

6 Sep, 2022 10:55 IST|Sakshi
PC: IPL.com

దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో పాల్గొనబోతున్న జోహన్నెస్‌బర్గ్ సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ హెడ్‌కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌ ఎంపికయ్యాడు. కాగా జోహన్నెస్‌బర్గ్  ఫ్రాంచైజీను ఐపీఎల్‌ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అదే విధంగా ఐపీఎల్‌లో సీఎస్‌కే హెడ్‌కోచ్‌గా కూడా ఫ్లెమింగ్ కొనసాగుతున్నాడు. ఇక తమ జట్టు కెప్టెన్‌గా దక్షిణాఫ్రికా స్టార్‌ ఆటగాడు ఫాఫ్ డు ప్లెసిస్‌ను జోహన్నెస్‌బర్గ్ నియమించిన విషయం తెలిసిందే.

అదే విధంగా తమ జట్టు బౌలింగ్‌ కోచ్‌గా ప్రోటీస్‌ మాజీ పేసర్‌ అల్బీ మోర్కెల్, అసిస్టెంట్ కోచ్‌గా ఎరిక్ సైమన్స్‌లతో జోహన్నెస్‌బర్గ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇక ఈ సరికొత్త టోర్నీ వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరిలో నిర్వహించేందు దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు ప్రయత్నాలు చేస్తోంది.ఇక దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌ తొలి సీజన్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గోనబోతున్నాయి. అయితే ఆరుకు ఆరు జట్లను ఐపీఎల్‌ ఫ్రాంచైజీలే దక్కించుకోవడం గమనార్హం.

జొహన్నెస్‌బర్గ్‌, కేప్‌ టౌన్‌ ఫ్రాంచైజీలను చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ సొంతం చేసుకోగా.. సెంచూరియన్‌, పార్ల్‌, డర్బన్‌,పోర్ట్ ఎలిజబెత్ ఫ్రాంచైజీలను ఢిల్లీ క్యాపిటల్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌,లక్నో సూపర్‌ జెయింట్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ దక్కించుకున్నాయి.
చదవండి: Asia Cup 2022: 'శ్రీలంకతో కీలక పోరు.. చాహల్‌ను పక్కన పెట్టి అతడిని తీసుకోండి'

మరిన్ని వార్తలు