బెయిర్‌ స్టో ప్రతీకారం.. కానీ ట్విస్ట్‌ ఏంటంటే

26 Jan, 2021 17:20 IST|Sakshi

లండన్‌: క్రికెట్‌ను జెంటిల్‌మెన్‌‌ గేమ్‌గా పిలవడం ఆనవాయితీగా వస్తుంది. అలాంటి ఆటలో వివాదాలు.. స్లెడ్జింగ్‌లు సాధారణంగా మారిపోయాయి. ఆటలో సందర్భంగా ఒక్కోసారి జరిగే సంఘటనలు ఫన్నీగా ఉంటూనే సిరీయస్‌గా కనిపిస్తాయి. తాజాగా ఇంగ్లండ్‌ ఆటగాడు జానీ బెయిర్‌ స్టో మ్యాచ్‌లో తనకు జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకున్నాడు. కానీ ట్విస్ట్‌ ఏంటంటే.. తాను అవుటవ్వడానికి కారణమైన ఆటగాడిని వదిలేసి మరొక ఆటగాడిపై స్లెడ్జింగ్‌కు దిగి అతని ఔట్‌కు కారణమయ్యాడు. ఈ ఘటన ఇంగ్లండ్‌, శ్రీలంకల మధ్య జరిగిన రెండో టెస్టులో చోటుచేసుకుంది.

అసలు విషయంలోకి వెళితే.. గాలే వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ సమయంలో జానీ బెయిర్‌ స్టోపై లంక వికెట్‌ కీపర్‌ నిరోషన్‌ డిక్‌వెల్లా స్లెడ్జింగ్‌కు దిగాడు. 'ఇండియా టూర్‌కు ఎంపిక కాలేకపోయావు.. కానీ ఐపీఎల్‌ ఆడేందుకు మాత్రం వెళ్తావు.. కేవలం డబ్బుల కోసమే ఆడతావా అంటూ' ట్రోల్‌ చేశాడు. దీంతో ఏకాగ్రత కోల్పోయిన బెయిర్‌ స్టో 28 పరుగుల వద్ద క్యాచ్‌ అవుట్‌గా వెనుదిరిగాడు. స్లెడ్జింగ్‌కు దిగి తనను అవుట్‌ చేశారన్న కోపంతో ఉన్న బెయిర్‌ స్టో అనువైన సమయం కోసం వేచి చూశాడు. చదవండి: 'గిల్‌ తల దించుకొని ఆడితే బాగుంటుంది'

ఈ దశలో లంక రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా  47 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన లంక కెప్టెన్‌ దినేష్‌‌ చండిమల్‌ను టార్గెట్‌ చేస్తూ బెయిర్‌ స్టో స్లెడ్జింగ్‌కు దిగాడు. 'కమాన్‌ చండీ.. నీ వికెట్‌ను త్వరగా పోగొట్టుకొని పెవిలియన్‌కు వెళ్లిపో అంటూ' పేర్కొన్నాడు. అండర్సన్‌ వేసిన బంతిని చండిమల్‌ గాల్లోకి లేపగా.. లాంగాఫ్‌లో ఉన్న జాక్‌ లీచ్‌ వెనుకకు పరిగెడుతూ అద్భుతక్యాచ్‌ అందుకున్నాడు. దీంతో చండిమల్‌ నిరాశగా క్రీజను వదిలిపెట్టి పెవిలియన్‌ బాట పట్టాడు. దీనికి సంబంధించిన వీడియోలను ట్విటర్‌లో షేర్‌ చేయగా.. వైరల్‌గా మారాయి. చదవండి: మ్యాక్సీని కొనుగోలు చేస్తే మూల్యం చెల్లించుకున్నట్లే

'బెయిర్‌ స్టో ప్రతీకారం బాగానే ఉంది.. కానీ వేరొక క్రికెటర్‌ బలి కావడం బాధగా అనిపించిందని కొందరు పేర్కొంటే.. దెబ్బకు దెబ్బ తీయడం అంటే ఇదే అంటూ' మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే ఇంగ్లండ్‌ జట్టు ఆరు వికెట్ల తేడాతో లంకపై విజయం సాధించి రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో వైట్‌వాష్‌ చేసింది. 

మరిన్ని వార్తలు