IPL 2022: ప్లేఆఫ్స్‌లో మాత్రం ఖచ్చితంగా రాణిస్తాను: జోస్‌ బట్లర్‌

23 May, 2022 21:46 IST|Sakshi
PC: IPL.COM

ఐపీఎల్‌-2022 ఫస్ట్‌ హాఫ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటగాడు జోస్‌ బట్లర్‌ దుమ్మురేపాడు. ఫస్ట్‌ హాఫ్‌లో అతడు మూడు సెంచరీలు నమోదు చేశాడు. ఒకానొక సమయంలో 2016లో విరాట్‌ కోహ్లి (973) సాధించిన అత్యధిక పరుగుల రికార్డును  అధిగమిస్తాడని అనిపించింది. అయితే సెకెండ్‌ హాఫ్‌లో మాత్రం బట్లర్‌ పూర్తిగా నిరాశపరుస్తున్నాడు. అతడు తన చివరి మూడు మ్యాచ్‌ల్లో సింగిల్ డిజిట్ స్కోర్‌లకే పరిమితమయ్యాడు. అయితే వరుసగా విఫలమవుతున్నప్పటికీ.. ప్లేఆఫ్స్‌లో మాత్రం ఖచ్చితంగా ఫామ్‌లోకి వస్తానని బట్లర్‌ తెలిపాడు. 

"ఐపీఎల్‌లో నా ఫామ్‌పై నేను సంతోషించాను. అయితే గత కొన్ని మ్యాచ్‌లలో మాత్రం కొంచెం నిరాశ చెందాను. టోర్నమెంట్ మొదటి బాగంలో నేను అత్యుత్తమంగా ఆడాను. ప్లేఆఫ్‌లో మాత్రం ఖచ్చితంగా రాణిస్తాను" అని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బట్లర్‌ పేర్కొన్నాడు. ఇప్పటి వరకు ఈ ఏడాది సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన బట్లర్‌.. 629 పరుగులు సాధించి ఆరెంజ్‌ క్యాప్‌ హోల్డర్‌గా ఉన్నాడు. ఇక మే24న ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా తొలి క్వాలిఫైయర్‌లో గుజరాత్‌ టైటాన్స్‌తో రాజస్తాన్‌ రాయల్స్‌ తలపడనుంది.

చదవండి: Virender Sehwag: 'అప్పుడు జహీర్ ఖాన్, ఆశిష్ నెహ్రా.. ఇప్పుడు అర్ష్‌దీప్ సింగ్‌'

మరిన్ని వార్తలు