IPL 2022 Jos Buttler: నా అద్భుత‌మైన ఫామ్‌కు కార‌ణం అత‌డే: జోస్ బ‌ట్ల‌ర్

25 Apr, 2022 18:08 IST|Sakshi
PC: IPL.com

ఐపీఎల్‌-2022లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఓపెన‌ర్ జోస్ బ‌ట్ల‌ర్ అద్భుత‌మైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది సీజ‌న్‌లో బ‌ట్ల‌ర్‌ ఇప్ప‌టి వ‌ర‌కు మూడు సెంచరీలతో పాటు 491 ప‌రుగులు సాధించాడు. కాగా ప్ర‌స్తుత సీజ‌న్‌లో బ‌ట్ల‌ర్ త‌న ఫామ్ వెనుక మాజీ పాకిస్తాన్ క్రికెటర్ ముస్తాక్ అహ్మద్ ఉన్నాడ‌ని తెలిపాడు. స్పిన్ బౌలింగ్‌లో త‌న  బలహీనతలను బలాలుగా మార్చుకోవ‌డంలో ముస్తాక్ అహ్మద్ ఎంతో తోడ్పడ్డాడని బ‌ట్ల‌ర్ చెప్పాడు.

“ముస్తాక్ అహ్మద్ ఎప్పుడూ నన్ను మొదట ఆఫ్‌సైడ్‌లో ఆడ‌మానేవాడు. ఆ త‌ర్వాతే లెగ్‌సైడ్ ఆడేందుకు ప్ర‌య‌త్నించ‌మ‌నేవాడు. ఆ త‌ర్వాతే నా బ్యాటింగ్ స్టైల్లో మార్పు చేసుకున్నాను అని జోస్ బట్లర్ పేర్కొన్నట్లు క్రికెట్ పాకిస్తాన్ పేర్కొంది.  కాగా 2008 నుంచి 2014 వ‌ర‌కు ఇంగ్లండ్ స్పిన్ బౌలింగ్ కోచ్‌గా ముస్తాక్ అహ్మద్ ప‌నిచేశాడు.

చ‌ద‌వండి: IPL 2022: నాలుగు భారీ రికార్డులపై కన్నేసిన ధవన్‌


 

మరిన్ని వార్తలు