పాపం కోహ్లి.. మూడు సార్లు అతని బౌలింగ్‌లోనే

2 Dec, 2020 20:52 IST|Sakshi

కాన్‌బెర్రా : క్రికెట్‌లో ప్రతీ బ్యాట్స్‌మెన్‌కు ఒక బౌలర్‌ కొరకరాని కొయ్యాగా మారడం సహజం. అది టెస్టు సిరీస్‌.. ద్వైపాక్షికం.. ముక్కోణపు టోర్నీ వన్డే సిరీస్‌.. ప్రపంచకప్‌ ఇలా ఏదైనా కావొచ్చు ఒక బ్యాట్స్‌మెన్‌ తనకు తెలియకుండానే ప్రతీ సారి అదే బౌలర్‌కు వికెట్‌ సమర్పించుకుంటాడు. ఉదాహరణకు మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ఆసీస్‌ మాజీ స్పీడస్టర్‌ బ్రెట్‌ లీ బౌలింగ్‌లో ఓవరాల్‌గా 14 సార్లు ఔటయ్యాడు. అలాగే మెక్‌గ్రాత్‌, మురళీధరన్‌లు కూడా సచిన్‌ను చాలాసార్లు ఔట్‌ చేశారు. టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనిని టెస్టులో ఇంగ్లండ్‌ బౌలర్లు అండర్సన్‌, బ్రాడ్‌లు తలా ఆరు సార్లు ఔట్‌ చేయడం జరిగింది. (చదవండి : ఈ ఓటమి మాకు మంచి గుణపాఠం : కోహ్లి)

తాజాగా టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి కూడా ఆసీస్‌తో జరుగుతున్న సిరీస్‌లో యాదృశ్చికంగా హాజల్‌వుడ్‌ బౌలింగ్‌లోనే మూడుసార్లు ఔటవ్వడం విశేషం. ఓవరాల్‌గా హాజల్‌వుడ్‌ ఇప్పటివరకు కోహ్లిని 7 సార్లు ఔట్‌ చేయగా.. అందులో వన్డేల్లో నాలుగుసార్లు, టెస్టుల్లో మూడు సార్లు ఉన్నాయి. దీంతో కోహ్లిని ఎక్కువసార్లు ఔట్‌ చేసిన ఆటగాళ్ల సరసన హాజిల్‌వుడ్‌ చోటు దక్కించుకున్నాడు. ఇంతకమందు ఆసీస్‌కే చెందిన ఆడమ్‌ జంపా,  నాథన్ లియోన్‌లతో పాటు దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ మోర్సీ మోర్కెల్‌, విండీస్‌ రవి రాంపాల్‌లు ఏడేసి సార్లు ఔట్‌ చేశారు. (చదవండి : నా ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నా : పాండ్యా)

ఇక టెస్టుల్లో చూసుకుంటే కోహ్లిని ఎక్కువసార్లు ఔట్‌ చేసిన ఘనత ఇంగ్లండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ జేమ్స్‌ అండర్సన్‌ పేరిట ఉంది. కోహ్లిని అండర్సన్‌ 8 సార్లు ఔట్‌ చేయగా.. ఇంగ్లండ్‌కే చెందిన గ్రేమి స్వాన్‌ కూడా కోహ్లిని 8 సార్లు ఔట్‌ చేశాడు. ఇక ఓవరాల్‌గా వన్డే, టెస్టులు కలిపి మొత్తంగా చూసుకుంటే కివీస్‌ ఫాస్ట్‌ బౌలర్‌ టిమ్‌ సౌథీ 10 సార్లు కోహ్లిని ఔట్‌ చేయడం విశేషం. రానున్న సుదీర్ష సిరీస్‌లో టీమిండియా మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది. ఈ రెండు ఫార్మాట్‌లోనూ హాజల్‌వుడ్‌ ఆసీస్‌ తుది జట్టులో ఉన్నాడు. దీంతో కోహ్లి హాజల్‌వుడ్‌కు ఎన్ని సార్లు బలవ్వనున్నాడో చూడాలి. (చదవండి : టీమిండియాకు ఓదార్పు విజయం)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా