2 ఓవర్లు.. 10 బంతుల్లో 5 వికెట్లు.. ప్రపంచం‍లోనే తొలి బౌలర్‌గా!

21 Feb, 2022 16:49 IST|Sakshi

టీ20 వరల్డ్‌కప్‌- 2022 క్వాలిఫియర్‌ మ్యాచ్‌లో భాగంగా జర్మనీతో బహ్రెయిన్ తలపడింది. ఈ మ్యాచ్‌లో బహ్రెయిన్ స్పిన్నర్‌ జునైద్ అజీజ్ ఓ అరుదైన రికార్డు సాధించాడు. ఈ మ్యాచ్‌లో జునైద్ అజీజ్ తన స్పిన్‌ మయాజాలంతో ప్ర్యతర్ధి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. అజాజ్‌ 2 ఓవర్లు పూర్తి చేయకుండానే 5 వికెట్లు పడగొట్టాడు. కేవలం 10 బంతుల్లోనే 5 వికెట్లు సాధించాడు. తొలి ఓవర్‌లో మూడు వికెట్లు పడగొట్టిన అజాజ్‌.. రెండో ఓవర్‌లో వరుస బంతుల్లో రెండు వికెట్లు సాధించాడు. అయితే టీ20 క్రికెట్‌లో రెండు ఓవర్లు పూర్తి కాకుండానే 5 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా అజాజ్‌ నిలిచాడు.

అజాజ్‌ స్పిన్‌ ధాటికి 106 పరుగులకే జర్మనీ కుప్పకూలింది. జర్మనీ బ్యాటర్లలో విజయ్‌ శంకర్‌ ఒక్కడే  50 పరుగులతో రాణించాడు. ఇక బహ్రెయిన్ బౌలర్లలో అజాజ్‌ వికెట్లు పడగొట్టగా, వసీం అహ్మద్‌ రెండు వికెట్లు సాధించాడు. ఇక 107 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన  బహ్రెయిన్ 4 వికెట్లు కోల్పోయి చేధించింది.  బహ్రెయిన్ బ్యాటర్లలో సర్ఫరాజ్‌ ఆలీ(69) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

చదవండి: IND Vs WI 3rd T20: దంచి కొట్టిండు.. దండం పెట్టిండు.. వైర‌ల‌వుతున్న సూర్య‌కుమార్ న‌మ‌సెల‌బ్రేష‌న్స్‌

మరిన్ని వార్తలు