Justin Langer: మూడు ఫార్మాట్లలో కొనసాగుతా.. ఐసీసీ ట్రోఫీలు గెలవడమే లక్ష్యం: హెడ్‌కోచ్‌

23 Dec, 2021 17:14 IST|Sakshi

Justin Langer: ఒకప్పుడు క్రికెట్‌ ప్రపంచాన్ని శాసించిన ఆస్ట్రేలియాకు మరోసారి మహర్దశ నడుస్తోందని చెప్పవచ్చు. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌-2021 ట్రోఫీ గెలిచి కొత్త చాంపియన్‌గా అవతరించింది ఆసీస్‌. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి ఏకంగా ట్రోఫీ సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌లోనూ అదరగొడుతోంది. ఇప్పటికే ఇంగ్లండ్‌పై తొలి రెండు టెస్టులలో ఏకపక్ష విజయం సాధించి.. సిరీస్‌ కైవసం చేసుకునే దిశగా ముందుకు సాగుతోంది. వీటన్నింటిలో హెడ్‌కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ పాత్ర ఉందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

బాల్‌ టాంపరింగ్‌(దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో) ఉదంతం తర్వాత ఆ అప్రదిష్టను చెరిపేసుకునేలా ఆట తీరుతో విమర్శకులకు సమాధానాలు ఇచ్చేలా జట్టును ప్రోత్సహించాడు. విజయాల బాట పట్టించి చాంపియన్‌గా నిలిపాడు. ఇక రానున్న రెండేళ్ల పాటు కంగారూలు బిజీబిజీగా గడుపనున్న సంగతి తెలిసిందే. అంతేగాక పొట్టి ఫార్మాట్‌ ప్రపంచకప్‌-2022 టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్నారు. ఆ తర్వాత 2023 వరల్డ్‌కప్‌ ఆడనున్నారు. ఈ నేపథ్యంలో క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడిన జస్టిన్‌ లాంగర్‌ మూడు ఫార్మాట్లకు కోచ్‌గా కొనసాగుతానని స్పష్టం చేశాడు. 

‘‘వేరే ఆలోచనకు తావే లేదు. అవును.. నేను మూడు ఫార్మాట్లలో కొనసాగుతాను. గత నాలుగేళ్లుగా మా జట్టు నిలకడైన ప్రదర్శన కనబరుస్తోంది. హెడ్‌కోచ్‌గా నా పనిని నేను ప్రేమిస్తున్నాను. మావాళ్లు చాలా బాగా ఆడుతున్నారు. అందులో ఎలాంటి సందేహం లేదు. వారితో మమేకం కావడం నాకు ఎంతో సంతోషం. ఇక ముందు కూడా ఇలాగే ఉంటుందని భావిస్తున్నా’’ అని లాంగర్‌ చెప్పుకొచ్చాడు. 2022, 2023 ప్రపంచకప్‌లతో పాటు వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ టైటిల్‌ గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నాడు. కాంట్రాక్ట్‌ పొడిగించాలనుకుంటున్నట్లు పరోక్షంగా తన మనసులోని మాటను వెల్లడించాడు. 

చదవండి: Kapil Dev: కపిల్‌లా బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌, కెప్టెన్సీ చేయండి.. అప్పుడే కప్‌ గెలుస్తారు! రోహిత్‌.. ఇంకా కోహ్లి...
IPL 2022- SRH: సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌ కోచ్‌గా బ్రియన్‌ లారా.. కొత్త సిబ్బంది వీళ్లే.. పరిచయం చేసిన ఫ్రాంఛైజీ

మరిన్ని వార్తలు