రజతం నెగ్గిన జ్యోతి యర్రాజీ

31 May, 2022 05:41 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌ మహిళా అథ్లెట్‌ జ్యోతి యర్రాజీ బెల్జియంలో జరిగిన ఐఫామ్‌ ఈఏ పర్మిట్‌ అంతర్జాతీయ అథ్లెటిక్స్‌ మీట్‌లో రజత పతకం సాధించింది. వైజాగ్‌కు చెందిన జ్యోతి 100 మీటర్ల హర్డిల్స్‌ ఫైనల్‌ రేసును 13.19 సెకన్లలో ముగించి రెండో స్థానంలో నిలిచింది.

జో సెడ్నీ (నెదర్లాండ్స్‌; 13.18 సెకన్లు) స్వర్ణం, జెన్నా బ్లన్‌డెల్‌ (బ్రిటన్‌; 13.30 సెకన్లు) కాంస్యం సాధించారు. హీట్స్‌లో జ్యోతి 13.26 సెకన్లతో రెండో స్థానంలో నిలిచింది. 

మరిన్ని వార్తలు