వరుస సెంచరీలతో దూసుకుపోతున్న కేన్‌ మామ.. సెంచరీ నంబర్‌ 45

16 Feb, 2024 16:06 IST|Sakshi

టెస్ట్‌ క్రికెట్‌లో న్యూజిలాండ్‌ స్టార్‌ ఆటగాడు కేన్‌ విలియమ్సన్‌ సెంచరీల దాహం తీరడం​ లేదు. గత ఆరు మ్యాచ్‌ల్లో ఆరు శతకాలు బాదిన కేన్‌ మామ.. తాజాగా మరో సెంచరీ చేశాడు. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా హ్యామిల్టన్‌ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్‌లో కేన్‌ సూపర్‌ సెంచరీతో మెరిశాడు. ఛేదనలో కేన్‌ అజేయ సెంచరీతో (133 నాటౌట్‌) చెలరేగి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. కేన్‌ టెస్ట్‌ కెరీర్‌లో ఇది 32వ శతకం. ఈ సెంచరీతో కేన్‌ ఫాబ్‌ ఫోర్‌లో (కోహ్లి, రూట్‌, స్మిత్‌, కేన్‌) అత్యధిక టెస్ట్‌ సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. 

 • కేన్‌ విలియమ్సన్‌- 32 (98 మ్యాచ్‌లు)
 • స్టీవ్‌ స్మిత్‌- 32 (107 టెస్ట్‌లు)
 • జో రూట్‌- 30 (138 టెస్ట్‌లు)
 • కోహ్లి- 29 (113 టెస్ట్‌లు)

ఫిబ్రవరి 3న ఫాబ్‌ ఫోర్‌లో నాలుగో స్థానంలో ఉన్న కేన్‌.. ఫిబ్రవరి 16 వచ్చే సరికి టాప్‌ ప్లేస్‌కు చేరాడు.

తాజా సెంచరీతో కేన్‌ సాధించిన మరిన్ని ఘనతలు..
గత ఏడు టెస్ట్‌ల్లో ఏడు సెంచరీలు.. గత నాలుగు ఇన్నింగ్స్‌ల్లో మూడు సెంచరీలు 

 • 4 & 132 వర్సెస్‌ఇంగ్లండ్‌
 • 1 & 121* వర్సెస్‌ శ్రీలంక
 • 215 వర్సెస్‌ శ్రీలంక
 • 104 & 11 వర్సెస్‌ బంగ్లాదేశ్‌
 • 13 & 11 వర్సెస్‌ బంగ్లాదేశ్‌
 • 118 & 109 వర్సెస్‌ సౌతాఫ్రికా
 • 43 & 133* వర్సెస్‌ సౌతాఫ్రికా

ప్రస్తుత క్రికెటర్లలో అత్యధిక సెంచరీలు..

 • విరాట్ కోహ్లీ - 80
 • డేవిడ్ వార్నర్ - 49
 • రోహిత్ శర్మ - 47
 • జో రూట్ - 46
 • కేన్ విలియమ్సన్ - 45*

న్యూజిలాండ్‌ తరఫున అత్యధిక టెస్ట్‌ సెంచరీలు (32).

కేన్‌ వరుస శతకాలతో (3) విరుచుకుపడటంతో న్యూజిలాండ్ తొలిసారి (92 ఏళ్ల చరిత్రలో) దక్షిణాఫ్రికాపై టెస్ట్ సిరీస్‌ గెలుచుకుంది.

న్యూజిలాండ్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా రెండో టెస్ట్‌ స్కోర్‌ వివరాలు..

 •  సౌతాఫ్రికా 242 (డి స్వార్డ్ట్‌ 64) & 235 (బెడింగ్హమ్‌ 110)
 •  న్యూజిలాండ్‌ 211 (కేన్‌ 43) & 269/3 (కేన్‌ 133 నాటౌట్‌)

7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ విజయం. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌ కూడా గెలిచిన న్యూజిలాండ్‌ 2-0 తేడాతో సఫారీలను క్లీన్‌ స్వీప్‌ చేసింది. 
 

whatsapp channel

మరిన్ని వార్తలు