ఐపీఎల్‌ 2021: మిగతా మ్యాచ్‌లకు కివీస్‌ ఆటగాళ్లు దూరం!

12 May, 2021 15:40 IST|Sakshi

ముంబై: ఐపీఎల్‌లో విదేశీ ఆటగాళ్లు లేకపోతే లీగ్‌కు స్టార్‌ కళ ఉండదు. మన టీమిండియా ఆటగాళ్లు ఎంతమంది ఉన్నా విదేశీ ఆటగాళ్లు లేకపోతే మజా రాదు. అది దృష్టిలో ఉంచుకొని కోట్లు గుమ్మరించి మరీ కొనుగోలు చేస్తాయి ఆయా ఫ్రాంచైజీలు. మరి అలాంటిది కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్‌ 14వ సీజన్‌ను బీసీసీఐ రద్దు చేసింది. అయితే సీజన్‌లోని మిగిలిన మ్యాచ్‌లను సెప్టెంబర్‌ విండోలో నిర్వహిస్తామని బీసీసీఐకి చెబుతున్నా అది అంత సులువు కాదని తెలుస్తోంది. బిజీ షెడ్యూల్‌ కారణంగా ఇప్పటికే  ఐపీఎల్‌ 14వ సీజన్‌ రెండో దశకు బిజీ  ఇంగ్లండ్‌ క్రికెటర్లు అందుబాటులో ఉండరని ఈసీబీ ప్రకటించిన విషయం తెలిసిందే.

తాజాగా ఒకవేళ ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌లను సెప్టెంబర్‌లో నిర్వహిస్తే కివీస్‌ ప్లేయర్లు లీగ్‌లో ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. సెప్టెంబర్‌ నెలలో యూఏఈ వేదికగా పాకిస్థాన్‌తో సిరీస్‌లో న్యూజిలాండ్‌ పాల్గొనాల్సి ఉంది. టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని కివీస్‌  జట్టు ఈ సిరీస్‌ను సీరియస్‌గా తీసుకోవాలని భావిస్తుంది. దీంతో కెప్టెన్‌ విలియమ్సన్‌, బౌల్ట్‌ సహా తదితర ఆటగాళ్లంతా ఐపీఎల్‌కు దూరమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇదే జరిగితే మాత్రం విదేశీ స్టార్లు అందుబాటులో లీగ్‌ కళ తప్పడంతో ఫ్రాంచైజీలు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. మరోవైపు బీసీసీఐ ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఐపీఎల్‌ 14వ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లను రీషెడ్యూల్‌ చేసి నిర్వహించాలని చూస్తుంది.  
చదవండి: 'విమర్శలు పట్టించుకోం.. మా పనేంటో మాకు తెలుసు'

'షార్ట్‌ వేసుకుందామనుకున్నా.. కానీ మాల్దీవ్స్‌లో లేను'

మరిన్ని వార్తలు