ఆటపై దృష్టిపెట్టు: ప్రియమ్‌ గార్గ్‌కు కేన్‌ సలహా

3 Oct, 2020 10:56 IST|Sakshi

దుబాయ్‌: చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో వరుసగా రెండో మ్యాచ్‌లో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఆటగాడు ప్రియామ్‌ గార్గ్‌ కారణంగా విలియమ్సన్‌ రనౌట్‌ అయ్యాడు. దీనిపై గార్గ్‌ స్పందిస్తూ.. విలియమ్సన్‌ మంచి బ్యాట్స్‌మన్‌. పరిస్థితులకు తగ్గట్టుగా ఆడగల ఆటగాడు. ఆ రనౌట్‌ నా పొరపాటు వల్లే జరగింది అని అన్నాడు.

ఇన్సింగ్స్‌ విరామ సమయంలో ఇదే విషయాన్ని గార్గ్‌ విలియమ్‌సన్‌ వద్ద ప్రస్తావించగా.. రనౌట్‌ గురించి చింతించవద్దు. దీని గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఆటపై దృష్టిపెట్టమని కేన్‌ సలహా ఇచ్చినట్లు వెల్లడించారు. కాగా.. 11వ ఓవర్‌ చివరి బంతిని షార్ట్‌ మిడ్‌వికెట్‌ వైపు ఆడి వెంటనే కేన్‌ పరుగు కోసం ముందుకు రాగా అవతలి వైపు నుంచి గార్గ్‌ స్పందించలేదు. (‘ప్రియ’మైన విజయం)

దీంతో చెన్నై ఫీల్డర్ అంబటి రాయుడు బంతిని వేగంగా కీపర్ ఎంఎస్ ధోనీకి విసరగా.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రనౌట్‌ చేశాడు. అయితే విలియమ్‌సన్‌ ఔట్‌ కావడంతో గార్గ్‌ చివరి వరకు క్రీజులో ఉండి 23 బంతుల్లో 51 పరుగులు చేశాడు. దీంతో మొదట బ్యాటింగ్‌ చేసిన  హైదరాబాద్‌ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టు 7 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు