Kane Williamson: కేన్‌ విలియమ్సన్‌ సంచలన నిర్ణయం.. ఇకపై

15 Dec, 2022 07:19 IST|Sakshi

న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో కివీస్‌ కెప్టెన్సీ బాధ్యతల నుంచి విలియమ్సన్‌  తప్పుకున్నాడు. వర్క్‌లోడ్‌ కారణంగానే టెస్టు కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పినట్లు సమాచారం. ఇకపై కేన్‌ మామ టీ20లు, వన్డేల్లో మాత్రమే సారథ్యం వహించనున్నాడు.

6 ఏళ్ల సుదీర్ఘకాలం పాటు సారథ్య బాధ్యతలు నిర్వహించిన కేన్‌.. తన జట్టుకు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించాడు. కాగా 2016లో బ్రెండెన్‌ మెకల్లమ్ అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకున్న తర్వాత న్యూజిలాండ్‌ కెప్టెన్సీ బాధ్యతలు విలియమ్సన్‌ స్వీకరించాడు.

ఇక విలియమన్స్‌ స్థానంలో టెస్టుల్లో టిమ్ సౌథీ నాయకత్వం వహించనున్నాడు. వైస్‌ కెప్టెన్‌గా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ టామ్‌ లాథమ్‌ ఎంపికయ్యాడు. కేన్‌ సారథ్యంలో 38 టెస్టు మ్యాచ్‌లు ఆడిన బ్లాక్‌క్యాప్స్‌.. 22 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 8 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ముఖ్యంగా అతడి నాయకత్వలోనే గతేడాది జరిగిన ఐసీసీ వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ను కివీస్‌ సొంతం చేసుకుంది.
చదవండి: FIFA WC:సెమీస్‌లో అదరగొట్టిన ఫ్రాన్స్‌.. రికార్డులు ‍బ్రేక్‌ చేస్తూ విజయం

>
మరిన్ని వార్తలు