ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన కపిల్‌ దేవ్‌

25 Oct, 2020 15:17 IST|Sakshi

న్యూఢిల్లీ: అనారోగ్యంతో ఆస‍్పత్రిలో చేరిన టిమిండియా మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ కోలుకుని ఇవాళ డిశ్చార్జ్‌ అయ్యారు. ఇటీవల కపిల్‌కు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు న్యూఢిల్లీలోని ఓ ప్రవైటు ఆస్పిత్రిలో చేర్పించగా అదే రోజు రాత్రి వైద్యులు ఆయనకు ఆపరేషన్‌ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండటంతో వైద్యులు ఆయనను డిశ్చార్జ్‌ చేసినట్లు మాజీ క్రికెటర్‌ చెతన్‌శర్మ ఆదివారం ట్విటర్‌ వేదికగా ప్రకటించాడు. కపిల్‌ దేవ్‌ ఆస్పత్రి వైద్యుడితో దిగిన ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘వైద్యుడు అతుల్ మాథుర్ కపిల్ పాజీకి యాంజియోప్లాస్టీ చేశాడు. ప్రస్తుతం కపిల్‌ కోలుకోవడంతో ఈ రోజు ఉదయం ఆయనను డిశ్చార్జ్‌ చేశారు’ అంటూ చేతన్‌ శర్మ ట్వీట్‌ చేశాడు. (చదవండి: గుండెకు ఆపరేషన్‌: కపిల్‌దేవ్‌ ట్వీట్‌)

అయితే అక్టోబర్‌ 23(శుక్రవారం) రాత్రి కపిల్‌కు గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చేరిన ఆయనకు వైద్యులు యాంజియోప్లాస్టీ చేశారు. అనంతరం ఆయనను ఐసీయుకు తరలించారు. ఇదే విషయాన్ని కపిల్‌ తర్వాత రోజు ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా ఆస్పత్రి యాజమాన్యం కూడా కపిల్‌ ఆరోగ్యంపై బులెటిన్‌ విడుదల చేస్తూ.. ‘కపిల్ ఐసీయు ఉన్నారని ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని చెప్పారు. మరో రెండు రోజుల్లో ఆయనను డిశ్చార్జ్‌ చేయనున్నట్లు పేర్కొన్నారు. (చదవండి: బ్రేకింగ్‌: కపిల్‌దేవ్‌కు గుండెపోటు)

మరిన్ని వార్తలు