రాజకీయాల్లోకి కపిల్ దేవ్‌..?  

24 May, 2022 10:35 IST|Sakshi

భారత్‌కు తొలి వన్డే ప్రపంచకప్‌ (1983) అందించిన దిగ్గజ ఆల్‌రౌండర్‌ కపిల్‌ దేవ్‌ పొలిటికల్‌ ఎంట్రీపై గతకొంత కాలంగా వివిధ వార్తలు ప్రచారంలో ఉన్నాయి. తాజాగా ఈ అంశంపై హర్యానా హరికేన్‌ స్పందించాడు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదని క్లారిటీ ఇచ్చాడు. అసలు తనకు రాజకీయాల పట్ల ఆసక్తే లేదని చెప్పుకొచ్చాడు. కొంతమంది ఇలా ఫేక్ న్యూస్‌ను స్ప్రెడ్ చేస్తుండటం బాధాకరమని అన్నాడు. ఒకవేళ తాను రాజకీయాల్లోకి రావాలనుకుంటే బహిరంగంగా ప్రకటిస్తానని ఇన్‌స్టా వేదికగా స్పష్టం చేశాడు.

కాగా, ఈ టీమిండియా మాజీ కెప్టెన్‌ పలువురు రాజకీయ నాయకులతో టచ్‌లో ఉన్నాడని సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. కపిల్‌ బీజేపీలో చేరుతున్నాడని కొందరు.. ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరుతున్నాడని మరికొందరు ఆయా పార్టీలకు చెందిన నాయకులతో కపిల్‌ కలిసి ఉన్న ఫోటోలను షేర్‌ చేస్తూ పని కట్టుకుని పుకార్లు పుట్టిస్తున్నారు. కపిల్ బీజేపీలో చేరి రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు వెళ్తారని, అలాగే ఆప్‌లో చేరి హర్యానా ముఖ్యమంత్రి అభ్యర్ధిగా పోటీ చేస్తారని ప్రచారం సాగుతుంది. 

మరిన్ని వార్తలు