బాలీవుడ్‌లో మరో స్టార్‌ క్రికెటర్‌ బయోపిక్‌.. డైరెక్ట్‌ చేయనున్న కరణ్‌ జోహార్‌..?

6 Oct, 2021 21:25 IST|Sakshi

Karan Johar To Direct Yuvraj Singh Biopic: ప్రస్తుతం బాలీవుడ్‌లో బయోపిక్‌ల హవా నడుస్తుంది. అందులోనూ క్రీడాకారుల బయోపిక్‌లకు ఎనలేని ఆదరణ ఉంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉన్న మన భారత క్రికెటర్ల బయోపిక్స్ మాత్రం తెరకెక్కింది మూడు మాత్రమే. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌, ఎంఎస్ ధోని, కపిల్‌ దేవ్‌ల నిజ జీవితాల ఆధారంగా ఈ చిత్రాలు తెరకెక్కాయి. తాజాగా మరో మాజీ క్రికెటర్ బయోపిక్‌కి సన్నాహాలు జరుగుతున్నట్లు బీటౌన్‌ వర్గాల ద్వారా తెలుస్తోంది. 

సిక్సర్ల కింగ్‌ యువరాజ్‌ సింగ్‌ నిజ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌ ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్దంగా ఉన్నాడని, ఈ మేరకు యువరాజ్‌తో సంప్రదింపులు కూడా జరిపాడని తెలుస్తోంది. కరణ్‌ ప్రతిపాదనకు యువీ వైపు నుంచి కూడా గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చిందని, త్వరలో ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కబోతుందని బీటౌన్‌ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. అయితే యువీ ప్రతిపాదించిన ఇద్దరు స్టార్‌ హీరోలను కాదని కరణ్‌.. కొత్త ముఖం వైపు మొగ్గు చూపుతున్నాడని సమాచారం. 

యువీ గతంలో హృతిక్‌ రోషన్‌, రణ్‌బీర్‌ కపూర్‌లలో ఎవరో ఒకరు తన బయోపిక్‌లో నటిస్తే బాగుంటుందని చెప్పినప్పటికీ.. కరణ్‌ కొత్త కుర్రాడు సిద్ధార్థ్‌ చతుర్వేదిని పరిచయం చేయాలని భావిస్తున్నాడని తెలుస్తోంది. సిద్ధార్థ్‌.. యువీతో దగ్గరి పోలికలు కలిగి ఉంటాడని, అందుకే యువీని ఒప్పించి మరీ అతన్ని ఎంపిక చేశాడని టాక్‌ నడుస్తోంది. మరోవైపు ఈ ప్రాజెక్ట్‌ను వీలైనంత తొందరగా పూర్తి చేసి.. గంగూలీ బయోపిక్‌ కంటే ముందే రిలీజ్‌ చేయాలని కరణ్‌ ప్లాన్‌ చేస్తున్నాడట.
చదవండి: ఒమన్‌లో తుఫాను బీభత్సం.. టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌లపై ప్రభావం..!

మరిన్ని వార్తలు