SL vs NZ: క్లియర్‌గా రనౌట్‌.. అయినా నాటౌట్‌ ఇచ్చిన అంపైర్‌! క్రికెట్‌ చరిత్రలో ఇదే తొలి సారి

25 Mar, 2023 19:38 IST|Sakshi

ఆక్లాండ్‌ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో 198 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ ఘన విజయం సాధించింది. 275 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. కివీస్‌ పేసర్ల దాటికి కేవలం 76 పరుగులకే కూప్పకూలింది. కివీస్‌ బౌలర్లలో హెన్రీ షిప్లీ ఐదు వికెట్లతో చెలరేగగా.. మిచెల్‌, టిక్నర్ తలా రెండు వికెట్లు సాధించారు. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో ఓ విచిత్రకర సంఘటన చోటు చేసుకుంది.
ఏం జరిగిందంటే?
శ్రీలంక ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌ వేసిన బ్లెయిర్ టిక్నర్ బౌలింగ్‌లో నాలుగో బంతిని ఆడిన కరుణరత్నే వెంటనే సింగిల్ తీయడానికి తీయడానికి ప్రయత్నించాడు. అయితే బంతిని అందుకున్న కివీస్‌ ఫీల్డర్‌  నాన్ స్ట్రైకర్‌ వైపు త్రో చేశాడు. బంతిని అందుకున్న టిక్నర్ వెంటనే స్టంప్స్‌ను పడగొట్టాడు. దీంతో ఫీల్డ్‌ అంపైర్‌ థర్డ్‌ అంపైర్‌కు రిఫర్‌కు చేశాడు. రిప్లేలో టిక్నర్ బెయిల్స్‌ పడగొట్టే సమయానికి కరుణరత్నే క్రీజుకు దూరంలో ఉన్నాడు.

దీంతో కరుణరత్నే ఔట్‌ అని అంతా భావించారు. అయితే ఇక్కడే కరుణరత్నేని అదృష్టం వెంటాడింది.  బంతి స్టంప్స్‌ తగలగానే వెలగాల్సిన జింగ్ బెయిల్స్‌ వెలగలేదు. వాటిలో బ్యాటరీలు అయిపోయాయి. దీంతో రూల్స్‌ ప్రకారం జింగ్ బెయిల్స్ వెలగని కారణంగా థర్డ్‌ అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించాడు.

అయితే అంపైర్‌ నిర్ణయం చూసిన కివీస్ ఆటగాళ్లు ఒక్క సారిగా ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా రనౌట్‌ విషయంలో బెయిల్స్‌ వెలగకపోవడం క్రికెట్‌ చరిత్రలో ఇదే తొలి సారి అంటూ నెటిజన్లు సోషల్‌ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: Virat Kohli: ఇంగ్లీష్‌ పరీక్షలో విరాట్‌ కోహ్లిపై ప్రశ్న.. క్వశ్చన్ పేపర్ వైరల్‌

మరిన్ని వార్తలు