రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌కు భయపడ్డాడు; అందుకే వికెట్లకు దూరంగా 

7 Aug, 2021 20:07 IST|Sakshi

లండన్‌: క్రికెట్‌లో వికెట్‌ కీపింగ్‌కు ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుంది. మ్యాచ్‌ జరుగుతున్నంత సేపు వికెట్‌ కీపర్‌ అలెర్ట్‌గా ఉండాల్సిందే. బంతి ఎక్కడ పడినా ఫీల్డర్‌ దానికి అందుకొని ఎక్కువగా విసిరేది కీపర్‌ వైపే. ఫాస్ట్‌ బౌలింగ్‌ వేసేటప్పుడు వికెట్లకు దూరంగా.. స్పిన్‌ బౌలింగ్‌ సమయంలో వికెట్లకు దగ్గరగా నిలబడడం  ఆనవాయితీ. అయితే ఈ ఆనవాయితీకి విరుద్ధంగా ఒక వికెట్‌ కీపర్‌ చేసిన పని ఆసక్తి కలిగించింది. విషయంలోకి వెళితే.. హండ్రెడ్‌ బాల్‌ కాంపిటీషన్‌లో భాగంగా ట్రెంట్‌ రాకెట్స్‌, వెల్ష్‌ ఫైర్‌ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ టామ్‌  మూర్స్‌ వికెట్లకు దూరంగా నిల్చున్నాడు.

ఇది చూడడానికి కాస్త వింతగా కనిపించడంతో సోషల్‌ మీడియాలో​వైరల్‌గా మారింది. టామ్‌ మూర్స్‌ తీరుపై నెటిజన్లు వినూత్న రీతిలో స్పందించారు. బహుశా రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌కు భయపడి అలా చేసి ఉంటాడని కామెంట్స్‌ చేశారు. టామ్‌ మూర్స్‌ అలా చేయడానికి ఒక కారణం ఉందట. అదేంటంటే రషీద్‌ స్పిన్‌ బౌలర్‌ అయినప్పటికీ అతని బౌలింగ్‌ పేస్‌ పదును ఎక్కువగా ఉంటుందని.. బంతి గమనం కూడా వేగంగా ఉంటుందని.. అందుకే దూరంగా నిల్చున్నా అంటూ టామ్‌ మూర్స్‌ చెప్పుకొచ్చాడు. 
 

మరిన్ని వార్తలు