‘కోహ్లిని ఔట్‌ చేయడానికి ఒక్క బాల్‌ చాలు’

14 Sep, 2020 11:48 IST|Sakshi

ఆంటిగ్వా:  విరాట్‌ కోహ్లినా అయితే నాకేంటి’ అంటూ పదే పదే రెచ్చగొడుతున్నాడు విండీస్‌ ఫాస్ట్‌ బౌలర్‌ కెస్రిక్‌ విలియమ్స్‌. ఎక్కువగా మీడియా దృష్టిని ఆకర్షించడానికి విలియమ్స్‌ ఇలా కామెంట్లు చేస్తున్నా అవి కాస్త హాస్యాస్పదంగానే ఉంటున్నాయి.  గతంలో కోహ్లిని ఔట్‌ చేసిన సందర్భాలని గుర్తుచేసుకుంటూ అతన్ని ఔట్‌ చేయడం తనకు చాలా ఈజీ అంటున్నాడు కెస్రిక్‌ విలియమ్స్‌. తాజాగా కోహ్లి గురించి ఫస్ట్‌పోస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కెస్రిక్‌ మాట్లాడుతూ..‘ కోహ్లికి బౌలింగ్‌ చేయడం కష్టం అనుకుంటున్నారా.. నాకైతే కాదు. (చదవండి: వారెవ్వా థీమ్‌.. ఈసారి మాత్రం వదల్లేదు)

కోహ్లి టాలెంటెడ్‌ ప్లేయర్‌.. కానీ కోహ్లి గురించి నాకు ఎటువంటి ఆందోళన లేదు. కోహ్లి ఉన్నాడు ఆలోచనే ఎప్పుడు రాదు.. చాలామందికి కోహ్లి ఉన్నాడంటే నిద్రపట్టకపోవచ్చు. నాకైతే అటువంటి భయం లేదు. హ్యాపీగా నిద్రపోతా. కోహ్లిని ఔట్‌ చేయడానికి నాకు ఒక్క బాల్‌ చాలు. అతనిపై పైచేయి సాధించడమే నాకు తెలిసిన విషయం. కోహ్లి వంటి దూకుడుగల ప్లేయర్‌కు సరైన పోటీ ఇవ్వకపోతే అప్పుడు అతని నుంచి భారీ స్కోర్లు వస్తాయి. నేను కోహ్లికి గట్టి పోటీ ఇవ్వడానికే సమాయత్తమవుతా’ అని కెస్రిక్‌ విలియమ్స్‌ తెలిపాడు.

గతేడాది వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఆ జట్టు పేసర్‌ కెస్రిక్‌ బౌలింగ్‌లో సిక్సర్‌ బాదాక విరాట్‌ కోహ్లి.. నోట్‌బుక్‌లో టిక్‌ పెడుతున్నట్టుగా సంబరాలు జరుపుకోవడం అందరిలోనూ ఆసక్తిని రేపింది. నిజానికది కెస్రిక్‌ విలియమ్స్‌ ట్రేడ్‌మార్క్‌ శైలి.  2017 విండీస్ పర్యటనలో కోహ్లిని ఔట్‌ చేసిన తర్వాత కెస్రిక్ విలియమ్స్ ఇదే తరహాలో సెలబ్రేషన్స్‌ చేసుకున్నాడు.  దీన్ని బాగాగుర్తుపెట్టుకున్న కోహ్లి..  గతేడాది భారత పర్యటనకు విండీస్  వచ్చిన సమయంలో హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టీ20ల్లో ధీటుగా బదులిచ్చాడు. ఆ మ్యాచ్‌లో విలియమ్స్‌ బౌలింగ్‌ను టార్గెట్ చేసి మరి ఆడిన విరాట్.. అతని తలపై నుంచి నేరుగా ఓ బంతిని బౌండరీకి తరలించాడు. ఆ వెంటనే లాంగాన్‌లో కళ్లు చెదిరే సిక్స్ కొట్టి అదే నోట్ బుక్ స్టైల్‌తో సంబరాలు జరుపుకున్నాడు.(చదవండి: కీపర్‌ రాకెట్‌ త్రోకు దిమ్మతిరిగింది)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు