యువీని ఉతికారేసిన కెవిన్‌ పీటర్సన్‌

10 Mar, 2021 10:24 IST|Sakshi

రాయ్‌పూర్‌: రోడ్‌ సెఫ్టీ వరల్డ్‌ టీ20 సిరీస్‌లో భాగంగా మంగళవారం ఇండియా లెజెండ్స్‌, ఇంగ్లండ్‌ లెజెండ్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో కెవిన్‌ పీటర్సన్‌ యువీ బౌలింగ్‌ను ఉతికారేశాడు. యువీ బౌలింగ్‌లో వరుస బంతుల్లో సిక్సర్లు బాది హాఫ్‌ సెంచరీ సాధించాడు. మరోవైపు ఇర్ఫాన్‌ పఠాన్ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్నా మ్యాచ్‌ను గెలిపించలేకపోయాడు.ఈ మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్‌ కేవలం 6 పరుగుల తేడాతో ఓటమి పాలయింది. అయితే పఠాన్‌ ఆడిన ఇన్నింగ్స్ మాత్రం మ్యాచ్‌లో హైలెట్‌గా నిలిచింది.

ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ లెజెండ్స్‌ నిర్ణీత 20వ ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఓపెనర్‌గా వచ్చిన కెవిన్‌ పీటర్సన్‌ 37 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 75 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ముఖ్యంగా యువరాజ్‌ బౌలింగ్‌లో రెండు వరుస సిక్సర్లు బాది 18 బంతుల్లోనే పీటర్సన్‌ హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. వన్‌డౌన్‌లో వచ్చిన మాడీ 29 పరుగులతో పీటర్సన్‌కు సహకరించాడు. ఇండియా లెజెండ్స్‌ బౌలర్లలో యూసఫ్‌ పఠాన్‌ 3, ఇర్ఫాన్‌ పఠాన్‌, మునాఫ్‌ పటేల్‌లు చెరో రెండు వికెట్లు తీశారు.  అయితే ఈ మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్‌ తరపున ఏడుగురు బౌలింగ్‌ చేయడం విశేషం.

అనంతరం 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి ఇండియా లెజెండ్స్‌ విజయానికి 6 పరుగుల దూరంలో నిలిచిపోయింది. గత మ్యాచ్‌‌ విన్నర్లు సెహ్వాగ్‌, సచిన్‌లు విఫలం కాగా.. 7వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఇర్ఫాన్‌ పఠాన్ (34 బంతుల్లోనే 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 61*పరుగులు)‌ ఉన్నంతసేపు ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. 30 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసిన అతను ఇన్నింగ్స్‌ చివరి వరకు నిలిచినా మ్యాచ్‌ను గెలిపించలేకపోయాడు.యువరాజ్‌ 22 పరుగులు చేయగా.. మిగతావారు విఫలమయ్యారు. కాగా ఇంగ్లండ్‌ లెజెండ్స్‌ బౌలింగ్‌లో పనేసర్‌ 3, జేమ్స్‌ ట్రెడ్‌వెల్‌ 2, హోగార్డ్‌, సైడ్‌ బాటమ్‌లు చెరో వికెట్‌ తీశారు.
చదవండి:
టీమిండియాలో స్థానం కోసం దూసుకొస్తున్న ఆర్‌సీబీ ఓపెనర్‌

'మ్యాక్స్‌వెల్.. 4,6,4,4,4,6.. నీకే తీసుకో'

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు