చిన్నప్పుడు ఏమైనా స్ప్రింగులు మింగాడా

4 Sep, 2020 15:40 IST|Sakshi

జ‌మైకా : టీ20 క్రికెట్ అంటేనే ధ‌నాధ‌న్ ఆట‌లా ఉంటుంది.. బ్యాట్స్‌మ‌న్ వీర బాదుడు, ఫీల్డింగ్ నైపుణ్యాలు, బౌల‌ర్లు బంతితో చేసే మేజిక్‌లు క‌ళ్ల ముందు క‌దులుతాయి. అటువంటి టీ20 క్రికెట్‌లో వికెట్ దొర‌క‌డ‌మే క‌ష్టం..  ఆరంభం నుంచి బాదుడే ప‌నిగా పెట్టుకునే బ్యాట్స్‌మెన్ల‌కు బౌల‌ర్లు చుక్కులు చూపించ‌డం కొంచెం క‌ష్ట‌మే. అందుకేనేమో టీ20 ఆట‌లో బౌల‌ర్‌కు వికెట్ ల‌భించగానే పెద్ద పండ‌గ‌లా చేసుకుంటారు. ఇంకొంద‌రు మాత్రం మ‌రికాస్త ముందుకెళ్లి త‌మ‌దైన శైలిలో సెల‌బ్రేష‌న్ నిర్వ‌హించుకుంటారు.

సీపీఎల్ 2020 లీగ్ సంద‌ర్భంగా గురువారం గ‌యానా వారియ‌ర్స్, బార్బ‌డోస్ ట్రైడెంట్స్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌ను ఉదాహ‌ర‌ణ‌గా చెప్పొచ్చు. గ‌యానా వారియ‌ర్స్ బౌల‌ర్ కెవిన్ సింక్లెయిర్ కీల‌క ఆట‌గాడిని ఔట్ చేసా అన్న ఆనందంలో దొమ్మ‌రిగ‌డ్డ‌లు వేస్తూ త‌న స‌ర‌దాను తీర్చుకున్నాడు. సాధార‌ణంగా సోమ‌ర్‌సాల్ట్స్‌(దొమ్మ‌రిగ‌డ్డ‌లు) కాళ్ల‌తో వేస్తుంటారు. కానీ సింక్లెయిర్ ఒక‌సారి మాత్ర‌మే కాళ్ల‌ను ఉప‌యోగించి మిగ‌తా రెండుసార్లు గాలిలోనే ప‌ల్టీలు కొట్టాడు. ఇది చూసిన మిగ‌తా ఆట‌గాళ్ల  సింక్లెయిర్ చిన్నప్పుడు ఎమైనా స్రింగులు మింగాడా అనే సందేహం క‌లిగింది. ప్ర‌స్తుతం సింక్లెయిర్ చేసిన ప‌ని సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది.(చదవండి : ‘సచిన్‌ను మర్చిపోతారన్నాడు’)

బార్బ‌డోస్ బ్యాటింగ్ చేస్తున్న 16 వ ఓవ‌ర్‌లో సింక్లెయిర్ ఈ విన్యాసం చేశాడు. లీగ్‌లో మంచి ఫామ్‌లో ఉన్న‌ మిచెల్ సాంట్న‌ర్.. త‌న బౌలింగ్‌లో వికెట్‌గా వెనుదిరగ‌డంతోనే ఇలా చేసిన‌ట్లు సింక్లెయిర్ చెప్పుకొచ్చాడు. కాగా ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన బార్బ‌డోస్ జ‌ట్టు 20 ఓవ‌ర్లలో 9వికెట్ల న‌ష్టానికి 89 ప‌రుగులే చేసింది. 90 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన గ‌యానా అమెజాన్ వారియ‌ర్స్ 15 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి విజ‌యం సాధించింది. ఈ విజ‌యంతో లీగ్‌లో రెండోస్థానానికి చేరుకున్న గ‌యానా వారియ‌ర్స్ సెమీఫైన‌ల్ బెర్త్ ఖ‌రారు చేసుకుంది. ఆడిన 10 మ్యాచ్‌ల్లో కేవ‌లం రెండు విజ‌యాలు మాత్ర‌మే న‌మోదు చేసిన డిపెండింగ్ చాంపియ‌న్ బార్బ‌డోస్ ట్రైడెంట్స్ పాయింట్ల ప‌ట్టిక‌లో చివ‌రి నుంచి రెండో స్థానంలో నిలిచి లీగ్ నుంచి నిష్క్ర‌మించింది.

మరిన్ని వార్తలు