'బ్రావోతో నేనేందుకు అలా ప్రవర్తిస్తాను'

15 Oct, 2020 20:15 IST|Sakshi
ఖలీల్‌ అహ్మద్‌(కర్టసీ : బీసీసీఐ)

దుబాయ్‌ : ఐపీఎల్‌ 13వ సీజన్‌లో మంగళవారం సన్‌రైజర్స్‌, సీఎస్‌కే మధ్య మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే 20 పరుగులతో ఎస్‌ఆర్‌హెచ్‌పై విజయం సాధించింది. ఈ సంగతి కాసేపు పక్కన పెడితే మ్యాచ్‌ మధ్యలో ఖలీల్‌ అహ్మద్‌, బ్రావో మధ్య చోటుచేసుకున్న సన్నివేశం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక అసలు విషయంలోకి వస్తే.. చెన్నై ఇన్నింగ్స్‌ సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన విండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావోను ఖలీల్‌ అహ్మద్‌ డకౌట్‌ చేశాడు. లెగ్‌స్టంప్‌ మీదుగా వెళ్లిన బంతిని బ్రావో అంచనా వేయడంలో పొరబడడంతో నేరుగా వికెట్లను గిరాటేసింది. అయితే ఖలీల్‌ ఎలాంటి సెలబ్రేషన్స్‌ చేయకుండా సైలంట్‌గానే ఉన్నాడు కానీ బ్రావోను చూస్తూ చిన్న వెకిలి నవ్వు నవ్వాడు. ఇప్పుడు ఆ వెకిలి నవ్వే ఖలీల్‌ను సోషల్‌ మీడియాలో విలన్‌ను చేసింది. ఇదే ఖలీల్‌ అహ్మద్‌ రాజస్తాన్‌తో మ్యాచ్‌ సందర్భంగా రాహుల్‌ తెవాటియాతోనూ గొడవ పడిన సంగతి తెలిసిందే. (చదవండి :ఏం చేసినా జట్టు కోసమే : తాహిర్‌)

'ఒక సీనియర్‌ అంతర్జాతీయ క్రికెటర్‌ అయిన బ్రావోకు నువ్వు ఇచ్చే గౌరవం ఇదేనా ' అంటూ మండిపడ్డారు. దీనితో పాటు ఖలీల్‌పై నెటిజన్లు కామెంట్లతో రెచ్చిపోయారు.'  ఖలీల్‌ చాలా రూడ్‌గా ప్రవర్తించాడు. ప్రతీ క్రికెటర్‌ ఎంతో కొంత స్పోర్టివ్‌ ప్రదర్శిస్తాడు. కానీ ఖలీల్‌కు కనీసం అది కూడా లేదు.. తెవాటియాతోనూ ఇలాంటిదే చేశావు.. షేమ్‌ ఆన్‌ యూ.. ఖలీల్‌కు అసలు క్రీడా స్పూర్తి అనేదే లేదు.. అంటూ మండిపడ్డారు.

అయితే దీనిపై ఖలీల్‌ అహ్మద్‌ స్పందించాడు. నేను బ్రావోను చూసి నవ్వలేదు. 'నా నవ్వు వెనుక అసలు కారణం అది కాదు. అయినా బ్రావో లాంటి ఆటగాడిపై నేను అలా ప్రవర్తిస్తానా చెప్పండి. అయినా నేను బ్రావోను అన్నలాగా భావిస్తాను. దయచేసి దీనిని పెద్ద ఇష్యూ చేయకండి.' అంటూ ట్విటర్‌లో పేర్కొన్నాడు. 

>
మరిన్ని వార్తలు