‘మూడోసారి వీడ్కోలు’ పలికిన కిమ్‌.. ఈసారి శాశ్వతంగా..

13 Apr, 2022 07:56 IST|Sakshi
కుటుంబంతో కిమ్‌ క్లియ్‌స్టర్స్‌

Kim Clijsters- న్యూజెర్సీ: గతంలో రెండుసార్లు రిటైర్మెంట్‌ (2007, 2012) ప్రకటించి.. ఆ తర్వాత మళ్లీ రాకెట్‌ పట్టిన బెల్జియం మహిళా టెన్నిస్‌ స్టార్‌ కిమ్‌ క్లియ్‌స్టర్స్‌ ఈసారి మాత్రం శాశ్వతంగా ఆటకు వీడ్కోలు పలికింది. ఇందుకు సంబంధించి సోషల్‌ మీడియా వేదికగా ఆమె ప్రకటన విడుదల చేసింది. కాగా గత ఏడాది ఇండియన్‌ వెల్స్‌ ఓపెన్‌లో చివరిసారి బరిలోకి దిగిన 38 ఏళ్ల క్లియ్‌స్టర్స్‌ తన కెరీర్‌లో నాలుగు గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ను (2005, 2009, 2010–యూఎస్‌ ఓపెన్‌; 2011–ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌) నెగ్గింది.

ఇక తన కుటుంబంతో అమెరికాలో స్థిరపడిన క్లియ్‌స్టర్స్‌ 2003లో తొలిసారి ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌ను అందుకుంది. కెరీర్‌ మొత్తంలో 41 టైటిల్స్‌ నెగ్గిన క్లియ్‌స్టర్స్‌ 523 మ్యాచ్‌ల్లో గెలిచి, 131 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. మొత్తం 2 కోట్ల 45 లక్షల 45 వేల 194 డాలర్ల (రూ. 186 కోట్లు) ప్రైజ్‌మనీని సంపాదించింది. 

చదవండి: IPL 2022: మొదట్లో కష్టాలు... తర్వాత చుక్కలు...  సిక్సర్ల సునామీతో చెన్నై బోణీ

మరిన్ని వార్తలు