టెన్నిస్‌ దిగ్గజంతో ఖడ్గం బ్యూటీ డేటింగ్‌..?

15 Jul, 2021 19:23 IST|Sakshi

ముంబై: 1996 అట్లాంటా ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత, 18 గ్రాండ్‌స్లామ్‌ల విజేత(డబుల్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌), భారత టెన్నిస్‌ దిగ్గజం లియాండర్‌ పేస్‌(48).. ఖడ్గం సినిమా బ్యూటీ కిమ్‌ శర్మతో డేటింగ్‌లో ఉన్నాడని గత కొంతకాలంగా ప్రచారం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ వార్తలను నిజం చేస్తూ.. వీరి జోడీ గోవా బీచ్‌లో చెట్టాపట్టాలేసుకుని విహరిస్తూ ఫోటోలకు పోజులిచ్చింది. అయితే వీరిద్దరూ ఇలా కెమెరా కంటికి చిక్కడం ఇది తొలిసారేమీ కాదు. గతంలోనూ చాలా సందర్భాల్లో వీరు దగ్గరగా కలిసి దిగిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. తాజా గోవా పర్యటనకు సంబంధించిన ఫోటోలను వారు బస చేసిన హోటల్‌ యాజమాన్యమే సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం విశేషం. 

A post shared by Pousada By The Beach (@pousadabythebeachgoa)

కాగా, 2007లో కిమ్‌ శర్మ.. టీమిండియా మాజీ క్రికెటర్‌, సిక్సర్ల వీరుడు యువ్‌రాజ్‌సింగ్‌తో ప్రేమాయణం సాగించింది. అయితే, వీరిద్దరికి పొసగకపోవడంతో కొద్దికాలంలోనే విడిపోయారు. ఆతర్వాత యువీ.. హేజిల్‌ కీచ్‌ను పెళ్లి చేసుకోగా, కిమ్‌ 2010లో కెన్యాకు చెందిన వ్యాపారవేత్తను మనువాడింది. అయితే, 2016లో అతని నుంచి కూడా విడాకులు తీసుకున్న ఈ 40 ఏళ్ల ఢిల్లీ భామ.. ఆతర్వాత నటుడు హర్షవర్ధన్‌ రాణేతో ప్రేమాయణం సాగించింది.

A post shared by Pousada By The Beach (@pousadabythebeachgoa)

ఆతర్వాత ఏమైందో తెలీదు కానీ ప్రస్తుతం ఆమె పేస్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు, పేస్‌ సైతం చాలా మందితో ఎఫైర్లు నడిపాడు. ఇటీవలి కాలంలో అతను ప్రముఖ మోడల్‌ రియా పిళ్ళైతో సహజీవనం చేస్తున్నట్లు వెల్లడించాడు. వీరికి ఓ కుమార్తె కూడా జన్మించింది. ప్రస్తుతానికైతే పేస్‌, కిమ్‌ జంట చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది. కాగా, కిమ్‌.. కృష్ణవంశీ పాపులర్‌ సినిమా ఖడ్గంలో 'ముసుగు వేయొద్దు మనసు మీద'.. అలాగే మగధీరలో 'ఏం పిల్లడో' పాటల ద్వారా టాలీవుడ్‌ భారీ ప్రేక్షకాధరణ పొందింది.

A post shared by The Project Café Ahmedabad (@theprojectcafeahd)

మరిన్ని వార్తలు