-

కేఎల్‌ రాహుల్‌ కొత్త చరిత్ర.. వరుసగా నాలుగోసారి

3 Oct, 2021 18:31 IST|Sakshi
Photo Courtesy: IPL

KL Rahul 4th Consecutive 500+ Runs IPL.. పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు. కొంతకాలంగా అద్భతు ఫామ్‌తో అదరగొడుతున్న రాహుల్‌ ఐపీఎల్‌లోనూ అదరగొట్టే ప్రదర్శన నమోదు చేస్తున్నాడు. తాజాగా ఐపీఎల్‌ 2021 సీజన్‌లో రాహుల్‌ 500 పరుగులు మార్క్‌ను అధిగమించాడు. ఈ సీజన్‌లో 500 పరుగులు సాధించిన రెండో బ్యాటర్‌గా రాహుల్‌ నిలిచాడు. సీఎస్‌కే ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ శనివారం రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 500 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. కాగా రాహుల్ ఐపీఎల్‌లో కొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో 4 వరుస సీజన్లలో 500 పరుగులు మార్క్‌ను అందుకొని రాహుల్‌ కొత్త రికార్డును నెలకొల్పాడు.

2018లో 659 పరుగులు, 2019లో 593 పరుగులు, 2020లో 670 పరుగులు సాధించిన రాహుల్‌ తాజాగా మరోసారి ఆ ఫీట్‌ను నమోదు చేశాడు. ప్రస్తుతం 12 మ్యాచ్‌లాడిన రాహుల్‌ 527 పరుగులతో ఆడుతున్నాడు. ఇందులో 5 అర్థ శతకాలు ఉన్నాయి. కాగా గత రెండు సీజన్లలో సెంచరీలు సాధించిన రాహుల్‌ ఈసారి శతకాన్ని నమోదు చేయలేదు. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో ఇప్పటివరకు 93 మ్యాచ్‌లాడిన కేఎల్‌ రాహుల్‌ 3174 పరుగులు సాధించాడు. ఇందులో 2 శతకాలు.. 26 అర్థ సెంచరీలు ఉన్నాయి.

ఇక ఆర్‌సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ నిలకడగా ఆడుతోంది.  తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్‌సీబీ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌ 11 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 92 పరుగులు చేసింది. మయాంక్‌ అగర్వాల్‌ 47, పూరన్‌ 1 పరుగులతో ఆడుతున్నారు.


 

మరిన్ని వార్తలు