IND VS SL: కేఎల్ రాహుల్ దయా హృదయం... బాలుడి శ‌స్త్ర‌చికిత్స కోసం ఏకంగా..!

22 Feb, 2022 17:07 IST|Sakshi

KL Rahul: ఇటీవ‌లే టీమిండియా వైస్ కెప్టెన్‌గా ప్రమోష‌న్ పొందిన డాషింగ్ ప్లేయ‌ర్ కేఎల్ రాహుల్.. అత్యంత అరుదైన బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న 11 ఏళ్ల చిన్నారి వ‌ర‌ద్ గురించి తెలుసుకుని చ‌లించిపోయాడు. ఆ చిన్నారి ఆప‌రేష‌న్ (బోన్ మ్యారో మ‌ర్పిడి)కు కావాల్సిన న‌గ‌దును స‌మ‌కూర్చి గొప్ప మ‌న‌సును చాటుకున్నాడు. గివ్‌ ఇండియా సంస్థ ద్వారా వరద్ గురించి తెలుసుకున్న రాహుల్‌.. వెంట‌నే త‌న టీమ్ ద్వారా వ‌ర‌ద్ త‌ల్లిదండ్రుల‌తో సంప్ర‌దింపులు జ‌రిపి శ‌స్త్ర‌చికిత్సకు కావాల్సిన రూ.31 లక్షల ఆర్ధిక సాయాన్ని త‌క్ష‌ణ‌మే అందజేసాడు. 

రాహుల్ స‌కాలంలో స్పందించ‌డంతో ఆపరేషన్ సక్సెస్ అయ్యి వరద్ ప్ర‌స్తుతం కోలుకుంటున్నాడు. విష‌యం తెలుసుకున్న రాహుల్‌ సంతోషాన్ని వ్య‌క్త‌ప‌ర‌చ‌గా, వరద్ త‌ల్లిదండ్రులు స‌చిన్ న‌ల్వాదే, స్వ‌ప్న ఝాలు రాహుల్‌కి రుణపడి ఉంటామ‌ని కృతజ్ఞతలు తెలిపారు. రాహుల్ ముందుకు రాకపోతే ఇంత తక్కువ సమయంలో వరద్‌కి శస్త్ర చికిత్స జరిగేది కాదని వార‌న్నారు. వ‌ర‌ద్‌కి కూడా రాహుల్‌లాగే క్రికెట‌ర్ కావాల‌ని కోరిక ఉంద‌ని, చిన్న‌త‌నంలో అత‌ని తండ్రి కొనిపెట్టిన బ్యాట్‌తో దిగిన ఫోటోను షేర్ చేశారు.

ఇదిలా ఉంటే, స్వ‌దేశంలో వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన కేఎల్ రాహుల్.. మూడో వన్డేతో పాటు టీ20 సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోక‌పోవ‌డంతో త్వ‌ర‌లో శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్‌తో పాటు టెస్టు సిరీస్‌కు సెలెక్ట‌ర్లు అత‌న్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేదు.
చ‌ద‌వండి: Shahid Afridi: అల్లుడూ.. నువ్వు సూప‌రప్పా, అచ్చం నాలాగే..!

 

>
మరిన్ని వార్తలు