టీమిండియా బ్యాక్‌ బెంచర్స్‌ను పరిచయం చేసిన రాహుల్‌

5 Dec, 2020 20:31 IST|Sakshi

కాన్‌బెర్రా: టీమిండియా క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఈ ఫొటోలకు అతడు పెట్టిన క్యాప్షన్‌‌ను చూసి క్రికెట్‌ అభిమానులు మురిసిపోతున్నారు. శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన తోలి ఇంటర్నేషనల్‌ టీ20 సిరీస్‌లో రాహుల్‌ తన మెరుపు ఇన్నింగ్స్‌తో అర్థసంచరీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్‌ టీమిండియా బ్యాక్‌ బెంచర్స్‌ను శనివారం అభిమానులకు పరిచయం చేశాడు. తన సహా ఆటగాళ్లైన హార్దిక్ పాండ్యా, మయాంక్ అగర్వాల్తో ట్రైన్‌ రైడ్‌కు వెళ్లిన రాహుల్‌ ఈ సందర్భంగా రెండు ఫొటోలను ట్విటర్‌లో షేర్‌ చేశాడు. ఇందులోని మొదటి ఫొటోలో రాహుల్‌ కుర్చోని ఉండగా ఎదురుగా పాండ్యా, మయాంక్‌లు నిలుచుని నవ్వులు పూయిస్తున్నారు. ఇక మరో ఫొటోలో హార్దిక్‌ పాండ్యా తన ఫొన్‌ చూసుకోవడంలో బిజీగా ఉండగా.. రాహుల్‌ మాత్రం ఎదో పేపర్‌ పట్టుకుని సిరీయస్‌గా చదువుకుంటున్నాడు.
(చదవండి: రవీంద్ర-చహల్‌ విజయం)

ఈ ఫొటోలకు రాహుల్‌ ‘బ్యాక్‌ బెంచర్స్‌’ అనే క్యాప్షన్‌ను జోడించి కళ్లజోడు పెట్టుకుని నవ్వుతున్న ఎమోజీని జత చేశాడు. కాగా శుక్రవారం కాన్‌బెర్రాలో ఆస్ట్రేలియాతో జరిగిన తోలి ఇంటర్నేషనల్‌ టీ20 సిరీస్‌ లో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆసిస్‌ టాస్‌ గెలిచి ఫిల్డింగ్‌ ఎంచుకోవడంతో భారత్‌ ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. కేఎల్‌ రాహుల్‌, శిఖర్‌ ధావన్‌లు ఇన్నింగ్స్‌ ప్రారంభించగా.. మూడో ఒవర్‌లోని ఐదో బంతికే ధావన్‌ వెనుదిరిగాడు. ఆ తర్వాత బరిలోకి వచ్చిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సైతం 9 పరుగులు మాత్రమే చేసిన నిరాశపరిచాడు. అయితే కేఎల్‌ రాహుల్‌ మాత్రం 37 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో హాఫ్‌ సెంచరి చేసి మెరిశాడు. కాగా రెండవ సిరీస్‌ ఆదివారం సిడ్నిలో జరగనుంది. (చదవండి: జీవితాంతం గుర్తుపెట్టుకుంటా: ఆసీస్‌ క్రికెటర్‌)

మరిన్ని వార్తలు