IND vs AUS: వైస్‌ కెప్టెన్‌ మాత్రమే కాదు.. కేఎల్‌ రాహుల్‌కు మరో బిగ్‌ షాక్‌!

20 Feb, 2023 19:21 IST|Sakshi

బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో మిగిలిన రెండు టెస్టులకు 17 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. జయదేవ్‌ ఉనాద్కట్‌ చేరిక మినహా పెద్దగా మార్పులు ఏమి చేయలేదు. అయితే కేఎల్‌ రాహుల్‌కు ఉన్న వైస్‌ కెప్టెన్‌ హోదాను మాత్రం తొలగించడం గమనార్హం. అదే విధంగా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు కూడా జట్టును ప్రకటించిన బీసీసీఐ.. వైస్‌ కెప్టెన్‌గా రాహుల్‌ స్థానంలో హార్దిక్‌ పాండ్యాను ఎంపిక చేసింది.

రాహుల్‌పై వేటు.. గిల్‌కు చోటు
ఇక తొలి రెండు టెస్టుల్లో దారుణంగా విఫలమైన కేఎల్‌ రాహుల్‌ను ఇండోర్‌ వేదికగా ఆసీస్‌తో జరగనున్న మూడో టెస్టుకు పక్కన పెట్టే అవకాశం ఉంది. అతడి స్థానంలో అద్భుతమైన ఫామ్‌లోఉన్న శుబ్‌మన్‌ గిల్‌కు అవకాశం ఇవ్వాలని జట్టు మెనెజ్‌మెంట్‌ భావిస్తున్నట్లు సమాచారం. కాగా ఆసీస్‌తో జరిగిన రెండో టెస్టుల్లో ఘన విజయం సాధించిన రోహిత్‌ సేన ప్రస్తుతం బ్రేక్‌లో ఉంది. మూడో టెస్టు కోసం  ఫిబ్రవరి 25న ఇండోర్‌లో ఆటగాళ్లు సమావేశం కానున్నారు.

"బోర్డుతో పాటు జట్టు మెనెజ్‌మెంట్‌ ఎప్పుడూ రాహుల్‌కు మద్దతుగా ఉంటుంది.  కానీ ప్రస్తుతం జట్టులో  అతడి స్థానం ప్రశ్నార్థకంగా మారింది. రాహుల్ గతంలో విదేశీ టెస్టుల్లో బాగా రాణించినప్పటికీ, ప్రస్తుతం మాత్రం ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు.

అదే సమయంలో యువ ఆటగాళ్ల నుంచి రాహుల్‌కు తీవ్రమైన పోటీ ఉంది. అయితే తొలి రెండు టెస్టుల్లో భారత్‌ విజయం సాధించి కాబట్టి.. అతడిని మిగిలిన రెండు టెస్టులకు కూడా సెలక్టర్లు ఎంపిక చేశారు. లేదంటే కొన్ని మార్పులు మనం చూసే వాళ్లం. అయితే ఇండోర్‌ టెస్టుకు శుబ్‌మన్‌ జట్టులోకి వచ్చే ఛాన్స్‌ ఉంది" అని బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు ఇన్‌సైడ్‌ స్పోర్ట్‌తో పేర్కొన్నారు.

కాగా పరిమిత ఓవర్ల క్రికెట్‌ విషయం పక్కనపెడితే టెస్టుల్లో మాత్రం రాహుల్‌ గత ఏడాది నుంచి దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. రాహల్‌ గత 10 ఇన్నింగ్స్‌లలో కనీసం 30 పరుగుల మార్క్‌ను కూడా దాటలేకపోవడం గమానార్హం. అతడు గత 10 ఇన్నింగ్స్‌లలో 13.57 సగటుతో 123 పరుగులు చేశాడు. అదే విధంగా ఆస్ట్రేలియాతో రెండు టెస్టులు కలిపి 38 పరుగులు మాత్రమే చేశాడు.
చదవండిIND vs AUS: కమిన్స్‌లా టీమిండియా లేదంటే పాకిస్తాన్‌ కెప్టెన్‌ చేసి ఉంటేనా.. వెంటనే!

మరిన్ని వార్తలు