IND Vs WI: జిమ్‌లో తెగ కష్టపడుతున్న రాహుల్‌.. వీడియో వైరల్‌..!

21 Jul, 2022 08:02 IST|Sakshi

విండీస్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఫిట్‌నెస్‌ సాధించేందుకు భారత స్టార్‌ ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ తెగ కష్టపడుతున్నాడు. గాయం కారణంగా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20సిరీస్‌కు అఖరి నిమిషంలో రాహుల్‌ దూరమైన సంగతి తెలిసిందే. అనంతరం గత నెలలో స్పోర్ట్స్‌ హెర్నియాకు జర్మనీలో సర్జరీ చేయించుకున్నాడు. ఇక  గాయం నుంచి కోలుకున్న రాహుల్‌ తిరిగి విండీస్‌ సిరీస్‌తో తిరిగి జట్టులోకి రానున్నాడు.

అయితే ఈ సిరీస్‌కు భారత తుది జట్టులో చోటు దక్కాలంటే రాహుల్‌ తన ఫిట్‌నెస్‌ నిరూపించుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో రాహుల్‌ బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. ఫిట్‌నెస్‌ సాధించేందుకు జిమ్‌లో చేస్తున్న వర్కౌట్‌లకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రాహుల్‌ పోస్ట్ చేశాడు. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా విండీస్‌ పర్యటనలో భాగంగా మూడు వన్డేలు,5 టీ20ల సిరీస్‌లో భారత్‌ తలపడనుంది. జూలై 22న పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ వేదికగా జరగనున్న తొలి వన్డేతో భారత టూర్‌ ప్రారభం కానుంది. 

వెస్టిండీస్‌ పర్యటనలో టీమిండియా షెడ్యూల్‌ ఇలా!
మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌
►జూలై 22- మొదటి వన్డే- క్వీన్స్‌ పార్క్‌ ఓవల్‌- పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌- ట్రినిడాడ్‌
►జూలై 24- రెండో వన్డే- క్వీన్స్‌ పార్క్‌ ఓవల్‌- పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌- ట్రినిడాడ్‌
►జూలై 27- మూడో వన్డే-క్వీన్స్‌ పార్క్‌ ఓవల్‌- పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌- ట్రినిడాడ్‌
►మ్యాచ్‌ సమయం: భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ఆరంభం

ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌
►మొదటి టీ20- జూలై 29- బ్రియన్‌ లారా స్టేడియం, టరౌబా, ట్రినిడాడ్‌
►రెండో టీ20- ఆగష్టు 1- వార్నర్‌ పార్క్‌, సెయింట్‌ కిట్స్‌
►మూడో టీ20- ఆగష్టు 2-వార్నర్‌ పార్క్‌, సెయింట్‌ కిట్స్‌
►నాలుగో టీ20- ఆగష్టు 6- సెంట్రల్‌ బ్రొవార్డ్‌ రీజనల్‌ పార్క్‌ స్టేడియం టర్ఫ్‌ గ్రౌండ్‌, ఫ్లోరిడా
►ఐదో టీ20- ఆగష్టు 7- సెంట్రల్‌ బ్రొవార్డ్‌ రీజనల్‌ పార్క్‌ స్టేడియం టర్ఫ్‌ గ్రౌండ్‌, ఫ్లోరిడా
►మ్యాచ్‌ సమయం: భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ఆరంభం

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్, కేఎల్ రాహుల్*, సూర్యకుమార్ యాదవ్, దీపక్‌ హుడా, శ్రేయాస్‌ అయ్యర్, దినేశ్‌ కార్తీక్, రిషబ్‌ పంత్, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, ఆర్ అశ్విన్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్*, భువనేశ్వర్‌ కుమార్, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్‌ సింగ్‌
చదవండి: NZ vs IRE 2nd T20: ఐర్లాండ్‌ను చిత్తు చేసిన న్యూజిలాండ్‌.. సిరీస్‌ కైవసం..!

A post shared by KL Rahul👑 (@klrahul)

మరిన్ని వార్తలు