IND Vs WI: కేఎల్‌ రాహుల్‌ హిట్టయ్యాడు కానీ సమస్య అక్కడే..

9 Feb, 2022 18:39 IST|Sakshi

టీమిండియా వైస్‌కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ మిడిలార్డర్‌లో మరోసారి సత్తా చాటాడు. వెస్టిండీస్‌తో రెండో వన్డేలో ఓపెనింగ్‌ స్లాట్‌లో కాకుండా నాలుగో స్థానంలో వచ్చిన రాహుల్‌ 49 పరుగులతో ఆకట్టుకున్నాడు. సూర్యకుమార్‌తో సమన్వయ లోపంతో అనవసర రనౌట్‌ తప్పించి బ్యాట్స్‌మన్‌గా మాత్రం రాహుల్‌ సక్సెస్‌ అయినట్లే. ముఖ్యంగా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన తర్వాత సూర్యకుమార్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 91 పరుగుల భాగస్వామ్యంతో టీమిండియా ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు.

చదవండి: Surya Kumar Yadav: వన్డే క్రికెట్‌ చరిత్రలో ఆ రికార్డు సాధించిన ఒకే ఒక్కడు

48 బంతుల్లో 49 పరుగులు చేసిన రాహుల్‌ ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్‌ ఉన్నాయి. దీంతో ఇకపై పరిమిత క్రికెట్‌లో రాహుల్‌ మిడిలార్డర్‌లో ఆడే అవకాశాలు ఎక్కువయ్యాయి. శ్రేయాస్‌ అయ్యర్‌కు మిడిలార్డర్‌లో అవకాశాలు ఇచ్చినప్పటికి సౌతాఫ్రికా సిరీస్‌లో వరుసగా విఫలమయ్యాడు. వెంకటేశ్‌ అయ్యర్‌ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇక ఇవాళ మ్యాచ్‌లో అర్థ సెంచరీతో రాణించిన సూర్యకుమార్‌ ఐదో స్థానానికి.. కేఎల్ రాహుల్‌ నాలుగో స్థానానికి ఫిక్స్‌ అయినట్లే. 

►మొత్తం 40 వన్డేలు ఆడిన రాహుల్‌ ఓపెనర్‌గా 21 మ్యాచ్‌ల్లో 884 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు.. 6 అర్థసెంచరీలు ఉన్నాయి. 
►ఇక ఐదో స్థానంలో 10 మ్యాచ్‌లాడి 453పరుగులు చేసిన రాహుల్‌కు ఒక సెంచరీతో పాటు నాలుగు అర్థసెంచరీలు ఉన్నాయి.
►నాలుగో స్థానంలో విండీస్‌తో మ్యాచ్‌ కలుపుకొని ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడాడు. ఈ ఐదు మ్యాచ్‌ల్లో 160 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ ఉండడం విశేషం. 
►ఇక మూడో స్థానంలో మూడు మ్యాచ్‌ల్లో 47 పరుగులు, ఆరో స్థానంలో ఒక మ్యాచ్‌ ఆడి 11 పరుగులు చేశాడు.

చదవండి: Rishabh Pant: కాపీ కొట్టడానికి సిగ్గుండాలి.. పంత్‌పై ట్రోల్స్‌ వర్షం

ఒక రకంగా రాహుల్ ఓపెనర్‌ నుంచి మిడిలార్డర్‌కు మారడం వల్ల ఓపెనింగ్‌ స్లాట్‌లో కొత్త సమస్య వచ్చి పడింది. ఇప్పటికైతే శిఖర్‌ ధావన్‌ రోహిత్‌తో కలిసి ఓపెనింగ్‌ చేసేందుకు సమస్య లేదు. ఒకవేళ ఈ ఇద్దరిలో ఎవరు గాయపడితే.. మయాంక్‌ అగర్వాల్‌, ఇషాన్‌ కిషన్‌ల మధ్య పోటీ నెలకొంటుంది. దీనికి తోడూ రుతురాజ్‌ కూడా పోటీలో ఉన్నాడు. అయితే విండీస్‌తో రెండో వన్డేకు ఇషాన్‌ అందుబాటులో ఉన్నప్పటికి రోహిత్‌ జట్టులోకి తీసుకోలేదు.

రిషబ్‌ పంత్‌ను ఓపెనర్‌గా ప్రమోట్‌ చేసినప్పటికి ఆ ప్లాన్‌ బెడిసికొట్టింది. పంత్‌ 34 బంతులాడి 18 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో పంత్‌ ఓపెనర్‌గా విఫలం కావడంతో తర్వాతి మ్యాచ్‌లో తన స్థానంలోనే బ్యాటింగ్‌కు  వచ్చే అవకాశం ఉండొచ్చు. అయితే పంత్‌ను ఓపెనర్‌గా ఒకే మ్యాచ్‌కు పరిమితం చేయకుండా మరికొన్ని మ్యాచ్‌ల్లో ఆడేందుకు అవకాశముండొచ్చు. ప్రస్తుతానికి ధావన్‌ మూడో వన్డేకు అందుబాటులోకి వస్తే.. ఇషాన్‌ కిషన్‌ మరోసారి డ్రెస్సింగ్‌రూమ్‌కు పరిమితం కావాల్సిందే.  

చదవండి: KL Rahul: సూర్య తప్పు లేదు.. ఎందుకు ఆగావో తెలీదు; అనవసర రనౌట్‌

మరిన్ని వార్తలు