IND vs AUS: ఏమైంది కోహ్లి? ఈజీ క్యాచ్‌ విడిచిపెట్టిన విరాట్‌! వీడియో వైరల్‌

11 Feb, 2023 14:06 IST|Sakshi

టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి ఫీల్డ్‌లో ఎంత చురుకగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విరాట్‌ తన స్టన్నింగ్‌ క్యాచ్‌లతో అభిమానలను ఆశ్చర్యపరిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే అటువంటి కింగ్‌ కోహ్లి.. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో మాత్రం సునాయస క్యాచ్‌లను అందుకోవడంలో విఫలమయ్యాడు.

తొలి ఇన్నింగ్స్‌లో రెండు ‍క్యాచ్‌లను జారవిడిచిన కోహ్లి.. రెండో ఇన్నింగ్స్‌లో కూడా ఈజీ క్యాచ్‌ను విడిచిపెట్టాడు. ఫస్ట్‌ స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేసిన కోహ్లి డేవిడ్‌ వార్నర్‌ ఇచ్చిన సులవైన క్యాచ్‌ను జారవిడిచాడు. అశ్విన్‌ బౌలింగ్‌లో వార్నర్‌ ఢిఫెన్స్‌ ఆడగా.. బంతి ఎడ్జ్‌ తీసుకుని నేరుగా కోహ్లి చేతికి వెళ్లింది.

అయితే కోహ్లి బంతిని అందుకోవడంలో విఫలమయ్యాడు. అయితే ఈజీ క్యాచ్‌ విడిచిపెట్టిన కోహ్లిని నెటిజన్లు దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. "స్లిప్‌ ఫీల్డింగ్‌ కోసం సబ్‌స్ట్యూట్‌గా రహానేను తీసుకురండి"అంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.

తొలి టెస్టులో భారత్‌ ఘన విజయం
తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్‌ 132 పరుగుల తేడాతో ఆసీస్‌ను భారత్‌ చిత్తు చేసింది. 223 పరుగుల వెనుకంజతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆస్ట్రేలియా.. భారత స్నిన్నర్ల దాటికి 91 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో అశ్విన్‌ ఐదు వికెట్లతో ఆసీస్‌ వెన్ను విరచగా.. జడేజా రెండు, షమీ రెండు, అక్షర్‌ పటేల్‌ ఒక్క వికెట్‌ సాధించారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండిIND vs AUS: అశ్విన్‌ అరుదైన రికార్డు.. రెండో భారత బౌలర్‌గా

మరిన్ని వార్తలు