ఆర్‌ఆర్‌ ఆటగాడికి గిఫ్ట్‌గా కోహ్లి బ్యాట్‌

4 Oct, 2020 17:54 IST|Sakshi

అబుదాబి: రాజస్తాన్‌ రాయల్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.. దేవదూత్‌ పడిక్కల్‌(63; 45 బంతుల్లో 6 ఫోర్లు, 1సిక్స్‌), విరాట్‌ కోహ్లి((72  నాటౌట్‌; 53 బంతుల్లో 7 ఫోర్లు, 2సిక్స్‌లు) రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. రాజస్తాన్‌ నిర్దేశించిన 155 పరుగుల టార్గెట్‌లో ఆర్సీబీ ఆదిలోనే ఫించ్‌(8) వికెట్‌ను కోల్పోయింది. ఆ తరుణంలో పడిక్కల్‌-కోహ్లిలు 99 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించారు. ఈ క్రమంలోనే పడిక్కల్‌ హాఫ్‌ సెంచరీ సాధించాడు. జట్టు స్కోరు 124 పరుగుల వద్ద ఉండగా పడిక్కల్‌ ఔట్‌ కాగా, ఆపై కోహ్లి-డివిలియర్స్(12 నాటౌట్‌; 10 బంతుల్లో 1 ఫోర్‌)‌లు లాంఛనం పూర్తిచేశారు.  ఆర్సీబీ రెండు వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. ఇది ఆర్సీబీకి మూడో విజయం కాగా, రాజస్తాన్‌కు రెండో ఓటమి. 

కాగా, రాజస్తాన్‌ ఆటగాళ్లకు ఆర్సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి గిఫ్ట్‌లు అందజేశాడు. ప్రత్యేకంగా తెవాటియా, రియాన్‌ పరాగ్‌లతో చాట్‌ చేసి అభినందించిన కోహ్లి.. వారికి కానుకలు ఇచ్చాడు. తెవాటియాకు తన జెర్సీని ఇచ్చిన కోహ్లి.. రియాన్‌ పరాగ్‌కు బ్యాట్‌ను కానుకగా ఇచ్చాడు. తన స్వహస్తలతో బ్యాట్‌పై సంతకం చేసి పరాగ్‌కు అందజేశాడు కోహ్లి. దీన్ని చూసి మురిసిపోతున్న పరాగ్‌.. ఆ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశాడు. దానికి గుడ్‌ వైబ్స్‌ అంటూ కామెంట్‌ చేశాడు పరాగ్‌. (చదవండి: సిక్సర్ల తెవాటియకు కోహ్లి కానుక)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు