కోహ్లి రిలాక్స్‌గా ఆడితేనే..

10 Aug, 2020 14:29 IST|Sakshi

ఆ బాధ్యత ఫించ్‌కు ఇస్తే కోహ్లికి ఉపయోగం

ఆర్సీబీ జట్టు కూర్పుపై బ్రెట్‌ లీ

సిడ్నీ: ఇప్పటివరకూ ఒక్కసారి కూడా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) టైటిల్‌ గెలవలేకపోయిన ఆర్సీబీ.. దాన్ని అధిగమించాలంటే కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి బ్యాట్‌ ఝుళిపించాల్సి ఉందని ఆసీస్‌ దిగ్గజ బౌలర్‌ బ్రెట్‌ లీ అభిప్రాయపడ్డాడు. ఎటువంటి ఒత్తిడికి లోనుకాకుండా తన సహజసిద్ధమైన ఆటను ఆడాలని కోహ్లికి సూచించాడు. కోహ్లికి ఒత్తిడి తగ్గిస్తేనే అది ఆర్సీబీకి ఉపయోగడపడుతుందని పేర్కొన్న బ్రెట్‌ లీ.. ఫించ్‌కు వైస్‌ కెప్టెన్సీ బాధ్యతలు అప్పచెబుతారని అనుకుంటున్నానని అన్నాడు. తొలిసారి ఆర్సీబీ తరఫున ఆడబోతున్న ఫించ్‌.. కోహ్లికి సాయంగా ఉంటాడనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. కోహ్లి తర్వాత వైస్‌ కెప్టెన్సీ రోల్‌ ఫించ్‌దేనని తాను అనుకుంటున్నట్లు చెప్పాడు. ఆర్సీబీ సక్సెస్‌ బాటలో పయనించాలంటే కోహ్లికి ఒత్తిడి తగ్గించాల్సిం‍దేనని లీ తెలిపాడు.(‘అందుకే అంబటి రాయుడ్ని తీసుకోలేదు’)

‘కోహ్లి కేవలం క్రికెట్‌ను ఆస్వాదిస్తూనే బ్యాటింగ్‌ చేయాలి. ఎటువంటి ఒత్తిడి తీసుకోకూడదు. ఒక ప్లేయర్‌గా ఒక కెప్టెన్‌గా సక్సెస్‌ కావాలంటే ఒత్తిడిని వదిలేయాలి. ప‍్రస్తుతం కోహ్లి ఎంతో ఎత్తులో ఉన్నాడు. ఒక్కోసారి జట్టులో విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. ఆటగాళ్లు విఫమైనప్పుడు ఆ భారాన్ని కెప్టెన్‌ మోయాల్సి ఉంటుంది. ఇక్కడ కోహ్లి ఒత్తిడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఆసీస్‌ జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్‌ అయిన అరోన్‌ ఫించ్‌ అనుభవం కోహ్లికి ఉపయోగపడుతుంది. ఫించ్‌ వైస్‌ కెప్టెన్‌గా ఉంటే కోహ్లి ఒత్తిడి తగ్గుతుంది’ అని స్టార్‌ స్పోర్ట్స్‌ నిర్వహించిన క్రికెట్‌ కనెక్టడ్‌ షోలో బ్రెట్‌ లీ పేర్కొన్నాడు. గతంలో పలు ఫ్రాంచైజీలకు ఐపీఎల్‌లో ఫించ్ ప్రాతినిథ‍్యం వహించగా, ఈ సీజన్‌ ఐపీఎల్‌గాను గతేడాది డిసెంబర్‌లో జరిగిన వేలంలో ఆర్సీబీ కొనుగోలు చేసింది.(కోహ్లికి ఒత్తిడి తగ్గిస్తా: ఆసీస్‌ కెప్టెన్‌)

ఇక్కడ చదవండి: ఆర్‌సీబీతోనే నా ప్రయాణం

మరిన్ని వార్తలు