కోహ్లి ఫ్లిక్‌ షాట్‌ వీడియో వైరల్‌

28 Nov, 2020 16:18 IST|Sakshi

సిడ్నీ: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 66 పరుగుల తేడాతో ఓటమి చెందింది. ఆసీస్‌ నిర్దేశించిన 375 పరుగుల ఛేదనలో టీమిండియాకు ఓపెనర్లు మయాంక్‌ అగర్వాల్‌-శిఖర్‌ ధావన్‌లు ఆకట్టుకునే ఆరంభాన్నే ఇచ్చారు. కానీ మయాంక్‌ అగర్వాల్‌ తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరిన తర్వాత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి భారీ షాట్లు ఆడే క్రమంలో 21 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. కోహ్లి పరుగు వద్ద​ ఉన్న సమయంలో కమిన్స్‌ బౌలింగ్‌లో కోహ్లి షాట్‌ ఆడగా అది గాల్లోకి లేచింది. కానీ ఫైన్‌లెగ్‌లో  ఫీల్డింగ్‌ చేస్తున్న ఆడమ్‌ జంపా ఈజీ క్యాచ్‌ను జారవిడిచాడు. (టీమిండియా ప్లేయర్స్‌కు జరిమానా)

దాంతో కోహ్లి లైఫ్‌ లభించింది. ఆ తర్వాత కోహ్లి మంచి టచ్‌లోకి వచ్చినట్లు కనబడ్డాడు. కొన్ని మంచి షాట్లతో కాసేపు అలరించాడు. రెండు ఫోర్లు, ఒక సిక్స్‌ కొట్టాడు. కమిన్స్‌ వేసిన తొమ్మిదో ఓవర్‌ రెండో బంతిని కోహ్లి సిక్స్‌గా మలచిన తీరు విపరీతంగా ఆకట్టుకుంది. కమిన్స్‌ సరైన లెంగ్త్‌లో బంతిని వేయలేకపోవడంతో కోహ్లి దానికి ఫ్లిక్‌ షాట్‌తో స్టాండ్స్‌లోకి పంపాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. (రాహుల్‌కు క్షమాపణ చెప్పా: మ్యాక్స్‌వెల్‌)

ఈ మ్యాచ్‌లో భారత్‌ 308 పరుగులకే పరిమితమైంది. హార్దిక్‌ పాండ్యా(90), శిఖర్‌ ధావన్‌(74)లు రాణించినా మిగతా వారి నుంచి సహకారం లభించలేదు. హార్దిక్‌ పాండ్యా మాత్రం వన్డేల్లో తొలి సెంచరీ చేసుకునే అవకాశాన్ని మిస్సయ్యాడు. ఇప్పటివరకూ వన్డేల్లో  సెంచరీ చేయని హార్దిక్‌..ఆసీస్‌తో తొలి వన్డేలో సెంచరీ చేస్తాడనిపించింది. కాగా, నెర్వస్‌ నైన్టీ అన్నట్లు 90 పరుగులకు చేరగానే వికెట్‌ను సమర్పించుకుని సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. 

మరిన్ని వార్తలు