Korea Open: పీవీ సింధుకు నిరాశ.. తప్పని ఓటమి

9 Apr, 2022 11:41 IST|Sakshi

Korea Open 2022: కొరియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధుకు నిరాశే ఎదురైంది. దక్షిణా కొరియాకు చెందిన అన్‌ సియోంగ్‌ చేతిలో సింధు సెమీ ఫైనల్‌లో  ఓటమి పాలైంది. పామా స్టేడియం వేదికగా శనివారం ఉదయం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీస్‌లో సియోంగ్‌ ఆది నుంచి దూకుడైన ఆటతో ముందుకు సాగింది. తొలి గేమ్‌లో అయితే సింధుకు అస్సలు అవకాశం ఇవ్వలేదు.

ఇక వరుస గేమ్‌లలో ఆధిపత్యం కనబరిచిన సియోంగ్‌ 21-14, 21-17తో సింధును ఓడించింది. దీంతో తెలుగు తేజం సింధు నిరాశగా టోర్నీ నుంచి నిష్క్రమించగా.. 20 ఏళ్ల సియోంగ్‌ ఫైనల్‌కు చేరి సత్తా చాటింది. కాగా అంతకుముందు.. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో సింధు 21–10, 21–16తో బుసానన్‌ (థాయ్‌లాండ్‌)ను ఓడించిన సంగతి తెలిసిందే.

బుసానన్‌పై 17వ సారి విజయం సాధించి సెమీస్‌లో అడుగుపెట్టింది. కానీ.. సెమీ ఫైనల్‌లో మాత్రం విజయయాత్రను కొనసాగించలేకపోయింది. ఆరంభం నుంచే వెనుకబడ్డ సింధు చివరికి ఓటమి పాలైంది.

మరిన్ని వార్తలు