కేఎస్‌ భరత్‌ మోగలేదు..

18 Feb, 2021 20:18 IST|Sakshi

చెన్నై: ఈ ఐపీఎల్‌ వేలం ముందువరకూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వికెట్‌ కీపర్‌ కేఎస్‌ భరత్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. దేశవాళీ మ్యాచ్‌ల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ భారత సెలక్టర్ల దృష్టిని ఆకర్షించడమే ఇందుకు కారణం. భారత్‌ తరఫున కొన్ని మ్యాచ్‌లకు స్టాండ్‌ బైగా జట్టులో కొనసాగిన శ్రీకర్‌ భరత్‌.. తాజా ఐపీఎల్‌ వేలంలో ఫ్రాంచైజీలను మాత్రం ఆకర్షించలేకపోయాడు. ఈ వేలంలో అతని కనీస ధర 20 లక్షలు ఉండగా, కనీసం రెండు కోట్ల వరకూ వెళతాడని విశ్లేషకులు అంచనా వేశారు.

చాలామంది అనామాక క్రికెటర్లు కోట్లు కొల్లగొట్టిన క్రమంలో కేఎస్‌ భరత్‌పై విశ్లేషకుల అంచనాను తప్పుబట్టలేం. కానీ అనూహ్యంగా కేఎస్‌ భరత్‌ కనీస ధరకే అమ్ముడుపోవడం చర్చనీయాంశమైంది. కేఎస్‌ భరత్‌ను 20 లక్షల రూపాయల కనీస ధరకే ఆర్సీబీ  కొనుగోలు చేసింది. ఆర్సీబీ బిడ్‌కు వెళ్లగా ఏ ఫ్రాంచైజీ కూడా ముందుకు రాలేదు. దాంతో 20 లక్షలకే ఆర్సీబీ సొంతమయ్యాడు భరత్‌. ఇప్పటివరకూ 78 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన కేఎస్‌ భరత్‌.. 4283 పరుగులు చేయగా, లిస్ట్‌-ఎ క్రికెట్‌లో 51 మ్యాచ్‌లు ఆడి 1351 పరుగులు చేశాడు.  టీ20 ఫార్మాట్‌లో 48 మ్యాచ్‌లకు గాను  730 పరుగులు నమోదు చేశాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 9 సెంచరీలు 23 హాఫ్‌ సెంచరీలు ఉండగా,  లిస్ట్‌-ఎ క్రికెట్‌లో 3 సెంచరీలు 5 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఇక టీ20 క్రికెట్‌లో మూడు హాఫ్‌ సెంచరీలు చేశాడు భరత్‌. 

ఇక్కడ చదవండి: ఏడేళ్ల తర్వాత పుజారా

మరో అన్‌క్యాప్‌డ్‌ ఆటగాడిపై కాసుల వర్షం

మరిన్ని వార్తలు