ఐపీఎల్‌ 2021: బీసీసీఐని రిక్వెస్టు చేసిన కేటీఆర్‌

28 Feb, 2021 14:14 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఐపీఎల్‌–2021 మ్యాచ్‌లను ముంబైలోనే నిర్వహించాలనే విషయంపై బీసీసీఐ పునరాలోచనలో పడింది. అక్కడ అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన నాలుగు పెద్ద మైదానాలు (వాంఖడే, బ్రబోర్న్, డీవై పాటిల్, రిలయన్స్‌) అందుబాటులో ఉండటం వల్ల ఏర్పాట్లు సులభతరం కావడంతో పాటు ఒకే నగరంలో ‘బయో సెక్యూర్‌ బబుల్‌’ను సమస్యలు లేకుండా సిద్ధం చేయవచ్చని బీసీసీఐ భావించింది. అయితే, మహారాష్ట్ర, ముంబైల్లో కరోనా మరోసారి విజృంభిస్తుండటంతో ఆటగాళ్ల భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

ఈ క్రమంలో ‘ఐపీఎల్‌ నిర్వహణ కోసం వేర్వేరు నగరాల పేర్లను పరిశీలిస్తున్నాం. హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కతా నగరాలను పరిగణనలోకి తీసుకుంటున్నాం. ప్లే ఆఫ్, ఫైనల్‌ మ్యాచ్‌లు ఎలాగూ అహ్మదాబాద్‌ లోనే జరుగుతాయి’ అని బీసీసీఐ ఉన్నతాధికారి శనివారం చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ వచ్చే ఐపీఎల్‌ను హైదరాబాద్‌లో నిర్వహించాలని బీసీసీఐని రిక్వెస్టు చేశారు. అన్ని మెట్రో నగరాలకన్నా హైదరాబాద్‌లో కరోనా కేసులు చాలా తక్కువ అని పేర్కొన్నారు. ఐపీఎల్‌కు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని కేటీఆర్ ట్వీట్‌ చేశారు.
(చదవండి: ప్రేక్షకులు లేకుండానే వన్డే సిరీస్‌)

మరిన్ని వార్తలు