‘విరాట్‌ కోహ్లి తిడతాడని భయపడ్డాను’

31 Aug, 2020 16:57 IST|Sakshi

న్యూఢిల్లీ: దాదాపు మూడేళ్ల క్రితం భారత క్రికెట్‌ జట్టులోకి అరంగేట్రం చేసిన చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ తన మార్కు స్పిన్‌తో రెగ్యులర్‌ సభ్యుడిగా మారిపోయాడు. కానీ 2017లోనే అతని అరంగేట్రం మొదలైంది. కాగా 2017లో దర్మశాల వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌ ద్వారా కుల్దీప్‌ టెస్టు అరంగేట్రం జరిగింది.  ఆసీస్‌తో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో కులదీప్‌ తొలి ఇన్నింగ్స్‌లో 68 పరుగులిచ్చి 4కీలక వికేట్లు పడగొట్టాడు. కులదీప్‌ మాయాజాలంతో ఆ మ్యాచ్‌లో భారత్‌ పైచేయి సాధించి విజయఢంకా మొగించింది. ప్రస్తుతం  యూఏఈలో జరగనున్న ఐపీఎల్‌లో కులదీప్‌ కోల్‌కత్త నైట్‌ రైడర్స్‌ తరపున ఆడనున్నాడు. తన తొలి మ్యాచ్‌లో అప్పటి కోచ్‌ అనిల్‌ కుంబ్లే సహకారం మరువలేనిదని తెలిపారు. 

కుల్దీప్‌ తన తొలి టెస్ట్ మ్యాచ్‌ విషయాల గురించి ఓ మీడియా సమావేశంలో పంచుకున్నాడు. కుల్దీప్‌ మాట్లాడుతూ.. ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌కు ఒక రోజు ముందే కుంబ్లే తనను కలిసి, రేపు జరగబోయే టెస్ట్‌ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టాలని అన్నాడు. అయితే మ్యాచ్‌ ప్రారంభ ముందు రోజు రాత్రి 9 గంటలకు పడుకున్నానని, తెల్లవారు జామున 3 గంటలకు మెళుకువ వచ్చిందని అన్నాడు. అయితే ఆ సమయంలో తీవ్ర ఒత్తిడి, ఉద్వేగంలో ఉన్నానని, తమ పక్క రూమ్‌లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఉన్నారని తెలిపాడు. కానీ అంత ఉదయాన విరాట్‌ బాయ్‌ను నిద్రలేపితే తిడతాడనే భయంతో విరాట్‌ను లేపకుండా తిరిగి తన రూమ్‌కు వెళ్లి 6 గంటల వరకు నిద్రపోయానని పేర్కొన్నాడు.

నిద్రలేచిన వెంటనే టిఫిన్‌ చేసి, గ్రౌండ్‌లో అడుగుపెట్టానని తన చిరకాలం స్వప్నం నేరవేరినందుకు సంతోషం, ఒత్తిడి, భావోద్వేగంతో ఉన్నట్లు తెలిపాడు. కానీ ఇలాంటి ఉద్విగ్న క్షణాల్లో ఒత్తిడికి లోనవడం సరికాదని సాధారణ రంజీ మ్యాచ్‌లాగా భావించాలని నిర్ణయించుకున్నట్లు కుల్దీప్‌ యాదవ్‌ పేర్కొన్నాడు.
చదవండి: 10 నిమిషాలు మైండ్‌ బ్లాక్‌: కుల్దీప్‌

మరిన్ని వార్తలు