శభాష్‌ అనిల్‌ కుంబ్లే: గావస్కర్‌

26 Oct, 2020 17:31 IST|Sakshi

న్యూఢిల్లీ: వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓటమి తర్వాత పుంజుకుని ప్లేఆఫ్స్‌ రేసు ఆశల్ని సజీవంగా ఉంచుకున్న కింగ్స్‌ పంజాబ్‌పై దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ ప్రశంసలు కురిపించాడు. వరుసగా నాలుగు విజయాలు సాధించి ఒక్కసారిగా రేసులోకి వచ్చేసిన పంజాబ్‌ పోరాట స్ఫూర్తితో దూసుకుపోవడానికి కోచ్‌ అనిల్‌ కుంబ్లేనే కారణమని గావస్కర్‌ కొనియాడాడు. తన క్రికెట్‌ కెరీర్‌లో ఏ విధంగా అయితే పోరాటం చేశాడో, అదే స్ఫూర్తితోనే జట్టులోకి నింపాడని గావస్కర్‌ ప్రశంసించాడు. స్టార్‌ స్పోర్స్‌  క్రికెట్‌ లైవ్‌ షోలో గావస్కర్‌ మాట్లాడుతూ.. ‘ కింగ్స్‌ పంజాబ్‌ వరుస విజయాల్లో కుంబ్లే రోల్‌ను మరచిపోకూడదు. కుంబ్లే ఒక పోరాట యోధుడు.  అది అతని క్రికెట్‌ కెరీర్‌లో చాలా దగ్గరగా చూశాం. తల పగిలినప్పుడు కూడా కట్టుకట్టుకుని బౌలింగ్‌ వేసి తన అంకిత భావాన్ని చాటుకున్నాడు. (ధోని ఈజ్‌ బ్యాక్‌: సెహ్వాగ్‌)

ఇప్పుడు కింగ్స్‌ పంజాబ్‌లో కూడా అదే అంకిత భావాన్ని నింపుతున్నాడు కుంబ్లే. అసాధ్యమనుకున్న పరిస్థితుల్ని నుంచి కింగ్స్‌ పంజాబ్‌ను గాడిలో పెట్టాడు. ప్రస్తుతం కింగ్స్‌ పంజాబ్‌ రేసులోకి వచ్చింది’ అని గావస్కర్‌ పేర్కొన్నాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఇటీవల జరిగిన మ్యాచ్‌లో 126 పరుగుల్ని కూడా కాపాడుకుని విజయాన్ని సాధించడం పంజాబ్‌ ఆటగాళ్లలో గెలవాలి అనే కసే కారణమన్నాడు. అందుకు వారిలో అనిల్‌ కుంబ్లే నింపిన స్ఫూర్తే ప్రధాన కారణంగా గావస్కర్‌ చెప్పుకొచ్చాడు. 

ఇక కింగ్స​ పంజాబ్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌పై కూడా గావస్కర్‌ ప్రశంసలు కురిపించాడు. కెప్టెన్సీ పాత్రలో రాహుల్‌ ఎంతో చక్కగా ఒదిగిపోయాడో మనం చూస్తున్న మ్యాచ్‌లే ఉదాహరణ అని తెలిపాడు.బ్యాటింగ్‌లో ఆకట్టుకోవడమే కాకుండా, ఫీల్డింగ్‌లో మార్పులు, బౌలింగ్‌ చేయిస్తున్న విధానం రాహుల్‌ కెప్టెన్‌గా ఎంతో ఎదిగాడు అనడాన్ని చూపెడుతుందన్నాడు. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో చివరి ఓవర్‌ను అర్షదీప్‌కు ఇవ్వడంలో రాహుల్‌ కెప్టెన్సీ చాతుర్యం కనబడిందన్నాడు.  ఎస్‌ఆర్‌హెచ్‌ 14 పరుగులు చేయాల్సిన సమయంలో అర్షదీప్‌ను బౌలింగ్‌కు ఉపయోగించి సక్సెస్‌ కావడం రాహుల్‌లోని కెప్టెన్సీ పరిణితికి నిదర్శమన్నాడు. (బ్రేక్‌లో ఒక ప్లేయర్‌ను మిస్సయ్యాం..!)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు